Smit Machchhar: స్మిత్ మచ్చార్ ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే? | | ACTPnews

స్మిత్ మచ్చార్


Last Updated:

Smit Machchhar: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు 174 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని భయానక ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

స్మిత్ మచ్చార్
స్మిత్ మచ్చార్

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ గురువారం అధికారికంగా వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను భారత రాయబారి దీపక్ మిట్టల్ స్వయంగా పరామర్శించారు. కెప్టెన్ స్మిత్‌కు అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా స్థానిక అధికార యంత్రాంగంతో యూఏఈలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం సమన్వయం చేసుకుంటోందని అధికారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

కాక్‌పిట్‌లో అసలేం జరిగింది?

బుధవారం ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన ఎఫ్ జెడ్ 1073 (FZ1073) విమానం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వైపు ప్రయాణిస్తోంది. విమానం గాల్లో ఉండగా, ఒమన్ దేశానికి చెందిన సహ పైలట్ ఉన్నట్టుండి తీవ్ర విధ్వంసానికి పూనుకున్నాడు. విమానాన్ని కూల్చేసే లక్ష్యంతో నియంత్రణను తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీనిని అడ్డుకునేందుకు కెప్టెన్ స్మిత్ ప్రయత్నించగా, సదరు సహ పైలట్ పదునైన ఆయుధంతో స్మిత్‌పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం విమానాన్ని కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే దాదాపు 14,000 అడుగుల కిందకు అత్యంత ప్రమాదకర రీతిలో వేగంగా దించేశాడు.

రక్తపు మడుగులోనూ అద్భుత ధైర్యం

కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావంతో కాక్‌పిట్ నేలపై పడిపోయిన కెప్టెన్ స్మిత్ మచ్చార్, ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు. తన చివరి శ్వాస వరకు పోరాడాలన్న సంకల్పంతో, ఒంట్లోని చివరి శక్తిని కూడదీసుకుని కాక్‌పిట్ తలుపులను లోపలి నుంచి విడుదల చేసే లాక్ (రిలీజ్ లాచ్)ను తెరిచారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినిధి డోరాన్ స్పీల్‌మాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్మిత్ సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపు తెరవడంతో అప్రమత్తమైన సిబ్బంది, కొందరు ప్రయాణికులు వెంటనే లోపలికి ప్రవేశించి విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న సహ పైలట్‌ను చాకచక్యంగా బంధించారు.

ఎమర్జెన్సీ ల్యాండింగ్.. సురక్షితంగా ప్రయాణికులు

ఈ తీవ్ర పరిణామాల అనంతరం విమానాన్ని వాయవ్య సౌదీ అరేబియాలోని తబుక్ నగర విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తొలుత తీవ్ర గాయాలతో ఉన్న కెప్టెన్ స్మిత్‌ను తబుక్ నగరంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన పరిస్థితి నిలకడగా ఉందని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మెరుగైన వైద్యం కోసం గురువారం ఆయనను తబుక్ నుంచి యూఏఈకి తరలించారు. ఇక విమానంలో ప్రయాణిస్తున్న 174 మంది ప్రయాణికులు ప్రాణాపాయం లేకుండా బుధవారమే సురక్షితంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు. విమానాన్ని కాపాడటంలో కెప్టెన్ స్మిత్ ప్రదర్శించిన సాహసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports