తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన సోదరులు, కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మైండ్ బ్లాకింగ్ ఆరోపణలతో ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను చెప్పిన విషయాలు తప్పు అని నిరూపిస్తే ఇకపై ఎప్పుడూ ప్రెస్‌మీట్ పెట్టనని, రేవంత్ రెడ్డి కుటుంబానికి బహిరంగ క్షమాపణలు చెప్తానని క్రిశాంక్ స్పష్టం చేశారు. మెడికోవర్ హాస్పిటల్స్, మాక్స్ బీఎన్ ఫార్మా, మైండ్ వాల్ కన్స్ట్రక్షన్స్, శోదా కన్స్ట్రక్షన్స్, స్వచ్ బయో, మరియు టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌ల పేరుతో రేవంత్ రెడ్డి కుటుంబం రూ. 50,000 కోట్ల స్కామ్‌కు పాల్పడిందని ఆరోపించారు. ఈ కంపెనీల్లో ‘దుంప శిరీష’ ఎందుకు డైరెక్టర్‌గా ఉన్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు.













