Flydubai: ఫ్లైదుబాయ్ విమానం ఘటనలో విస్తుపోయే నిజాలు.. ఏకంగా ఆ పని చేసేందుకు కో-పైలట్ యత్నం! | | ACTPnews

Flydubai: ఫ్లైదుబాయ్ విమానం ఘటనలో విస్తుపోయే నిజాలు.. ఏకంగా ఆ పని చేసేందుకు కో-పైలట్ యత్నం! |


వేల అడుగుల ఎత్తులో రెండు ఇంజిన్లకు ఇంధనం ఆగిపోతే ఏమవుతుంది?

బోయింగ్ 737 ఇంజిన్లకు థ్రస్ట్ (ముందుకు నెట్టే శక్తి) రావాలంటే నిరంతరం ఇంధన సరఫరా అవసరం. కాక్‌పిట్‌‌లోని ఇంజిన్ స్టార్ట్ లివర్లలో ‘ఐడిల్’ (IDLE), ‘కటాఫ్’ (CUTOFF) అనే ఆప్షన్లు ఉంటాయి. ‘కటాఫ్’ ఎంపిక చేస్తే ఇంజిన్లకు ఇంధన సరఫరా తక్షణమే నిలిచిపోతుంది.

అయితే ఇంధనం ఆగిన వెంటనే విమానం అదుపు తప్పుతుందని కాదు. క్రూయిజింగ్ ఎత్తులో ఉన్న విమానానికి ఉండే గతి శక్తి (ఫార్వర్డ్ మొమెంటమ్) వల్ల, ఇంజిన్ల శక్తి లేకపోయినా అది గ్లైడర్ లాగా కొంత దూరం ప్రయాణించగలదు. కానీ ఇంజిన్లు విమానాన్ని ముందుకు తోయకపోవడంతో, ఇంజిన్లను మళ్లీ స్టార్ట్ చేయకపోతే లేదా ఇతర ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే విమానం వేగంగా ఎత్తును కోల్పోతూ కిందికి దిగిపోతుంది.

ఇలాంటి ఆధునిక జెట్ విమానాల్లో ఒక ఇంజిన్ ఆగిపోతే పైలట్లు దాన్ని ఎదుర్కొనేలా శిక్షణ పొందుతారు. కానీ రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడం అత్యంత తీవ్రమైన విపత్తుగా మారుతుంది.

ఆ రోజు ఏం జరిగింది?

170 మందికి పైగా ప్రయాణికులతో దుబాయ్ నుంచి టెల్ అవీవ్ బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఈ సంక్షోభం తలెత్తింది. దర్యాప్తు వివరాల ప్రకారం, ఒమన్ కో-పైలట్ హమ్మామ్ అల్-హమ్మామి కాక్‌పిట్ లోపల కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై క్రాష్ యాక్స్ (గొడ్డలి)తో దాడి చేశాడు. విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు తీవ్రవాద చర్యకు పాల్పడ్డాడని యూఏఈ అటార్నీ జనరల్ పేర్కొన్నారు.

తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ మచ్చార్ చాకచక్యంగా కాక్‌పిట్ తలుపు తెరిచే యంత్రాంగాన్ని ఆన్ చేశారు. దీంతో వెంటనే ప్రయాణికులు జోక్యం చేసుకుని నిందితుడిని అడ్డుకున్నారు. ఫ్లైట్ కంట్రోల్స్‌పై అవగాహన ఉన్న ఒక ప్రయాణికుడు విమానాన్ని స్థిరీకరించడంలో సాయపడగా, విమానంలో ప్రయాణిస్తున్న ఆఫ్-డ్యూటీ పైలట్లు ఇద్దరు వెంటనే కాక్‌పిట్‌‌లోకి వెళ్లి నియంత్రణ చేపట్టారు. చివరకు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ నగరంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు.

ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం, బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం 34,000 అడుగుల ఎత్తు నుంచి కొద్ది సెకన్లలోనే 16,600 అడుగులకు పడిపోయింది. ఆ తర్వాత విమానం ఎమర్జెన్సీ కోడ్ ‘7700’, ఆపై హైజాకింగ్ లేదా చట్టవిరుద్ధ జోక్యాన్ని సూచించే ‘7500’ ట్రాన్స్‌పాండర్ కోడ్‌ను జారీ చేసింది.

ఇంజిన్లను మళ్లీ రీస్టార్ట్ చేయడం సాధ్యమేనా?

థ్రస్ట్ లేనప్పుడు విమానం భారీ గ్లైడర్‌గా మారి, వేగాన్ని కాపాడుకోవడం కోసం ఎత్తును కోల్పోతుంటుంది. ఇంజిన్లు ఎక్కువసేపు అందుబాటులో లేకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది. సమస్యను సరిదిద్ది, విమానం సరైన పరిస్థితుల్లో ఉంటే గాల్లోనే ఇంజిన్లను మళ్లీ రీస్టార్ట్ చేసే విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్‌ఏఏ (FAA) నిబంధనల ప్రకారం ఇంధన సరఫరా పునరుద్ధరించాక, ఇంజిన్లను రీస్టార్ట్ చేసి థ్రస్ట్‌ను తిరిగి పొందవచ్చు. ఆ సమయంలో విమానంలో అనుభవజ్ఞులైన పైలట్లు ఉండటం వల్లనే విమానాన్ని అదుపులోకి తెచ్చి రీస్టార్ట్ చేయగలిగారు.

విమానం ఎలా బయటపడింది?

విమానంలో ఉన్న ఎత్తు, ఏరోడైనమిక్ నియంత్రణ, సరైన సమయానికి స్పందించిన శిక్షణ పొందిన వ్యక్తులు, వీటన్నింటికీ మించి లభించిన సమయం ఆ 170 మందికి పైగా ప్రాణాలను కాపాడాయి. “ఆ క్షణంలో నేను నా ప్రాణాల కోసం పోరాడాను” అని కెప్టెన్ మచ్చార్ తర్వాత గుర్తుచేసుకున్నారు.

ఒకవేళ ఇంజిన్ కటాఫ్ నిజమేనని తేలితే, కాక్‌పిట్‌లో దాడిని అడ్డుకోవడమే కాకుండా, ఇంజిన్లు ఆగిపోయి విమానం కుప్పకూలకుండా సెకన్ల వ్యవధిలో జరిగిన మరో పెను పోరాటం కూడా బయటపడినట్లే. ప్రస్తుతం యూఏఈ దర్యాప్తు బృందం ఫ్లైట్ డేటా రికార్డర్లు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed