Shocking: కూతురుపై తండ్రి అత్యాచారం.. నగ్న ఫొటోలు తీసిన తల్లి.. 14 ఏళ్ల అమ్మాయి కేసుపై పోలీసులు షాక్ | | ACTPnews

POCSO Case (ఫైల్)


Last Updated:

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓ కుటుంబంలో జరిగిన వివాదానికి దారితీసిన పరిస్థితులు సంచలనం సృష్టిచింది. ఇంట్లో జరిగిన పరిణామాలపై 14 ఏళ్ల బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె చేసిన ఆరోపణలు విని అధికారులు కూడా షాక్ అయ్యారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? బాలిక పోలీసుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

POCSO Case (ఫైల్)
POCSO Case (ఫైల్)

Minor Girl Case: గుజరాత్‌లోని కచ్ జిల్లా అంజర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలిక తన తండ్రిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అంతేకాకుండా ఓ బాలుడితో ఫోన్‌లో మాట్లాడినందుకు తనను ఇంట్లో నిర్బంధించి వేధించారని తెలిపింది. ఈ ఘటన సమయంలో తన తల్లి కూడా అక్కడే ఉండి తన ఫొటోలు తీసిందని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బాలిక తల్లిదండ్రులపై పోక్సో చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బాలుడితో మాట్లాడటమే కారణమా?

బాలిక తన తల్లిదండ్రులు, ముగ్గురు సోదరీమణులతో కలిసి అంజర్‌లో నివసిస్తోంది. ఆ కుటుంబం మరో రాష్ట్రానికి చెందినదని, సుమారు ఆరు సంవత్సరాలుగా గుజరాత్‌లో ఉంటున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14న ఆగ్రాకు చెందిన ఓ బాలుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా తల్లి గమనించి ఆమెను ప్రశ్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, బాలిక ఓ అబ్బాయితో మాట్లాడుతోందని, అతనితో సంబంధం ఉందని తల్లి చెప్పినట్లు తెలిపింది.

ఇంట్లో నిర్బంధించి వేధింపులు

ఈ విషయం తెలుసుకున్న తండ్రి ఆగ్రహంతో తనపై దాడి చేసి ఇంట్లోనే బంధించాడని బాలిక ఆరోపించింది. తనకు ఆహారం, నీరు ఇవ్వకుండా కొన్ని గంటల పాటు శారీరకంగా వేధించారని పేర్కొంది. ఆ తర్వాతి రోజుల్లో ఇంట్లోనే పలుమార్లు తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ సమయంలో తల్లి కూడా అక్కడే ఉందని ఫిర్యాదులో తెలిపింది. ఈ వేధింపులు సెప్టెంబర్ 20న, సెప్టెంబర్ 29న కూడా కొనసాగినట్లు బాలిక ఆరోపించింది.

అత్తకు చెప్పడంతో విషయం వెలుగులోకి

సెప్టెంబర్ 29న బాలిక అదే నివాస సముదాయంలో ఉండే తన అత్త ఇంటికి వెళ్లి ఆమె ఫోన్‌ నుంచి 112 అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే తల్లిదండ్రులు ఆ ఫోన్‌ను తీసుకుని ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లారని, అనంతరం మళ్లీ ఇంట్లోనే నిర్బంధించారని బాలిక ఆరోపించింది. అక్టోబర్ 1న కూడా తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆ సమయంలో తల్లి అక్కడే ఉందని తెలిపింది.

పోలీసుల దర్యాప్తు

అక్టోబర్ 1న తండ్రి పనికి వెళ్లిన మరుసటి ఉదయం బాలిక మళ్లీ అత్త ఇంటికి చేరుకుని జరిగిన విషయాలను వివరించింది. అనంతరం మరోసారి పోలీసుల అత్యవసర నంబర్‌కు సమాచారం అందించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం బాలికను అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. కేసులో నమోదైన ఆరోపణలపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports