తెలంగాణలో రాబోయే వారం రోజుల వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. గురువారం (మే 14, 2026) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు 3 నుండి 5 డిగ్రీల వరకు తగ్గే ఛాన్స్ ఉందని తెలిపారు. అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం తీవ్ర వడగాల్పుల (Heatwave) హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 4-5 రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Source link
Heatwave Alert in Telangana : తెలంగాణకు హీట్ వేవ్ వార్నింగ్! 45 డిగ్రీలు దాటనున్న ఎండలు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










