Rajeev Kanakala: సరికొత్తగా అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి.. ఘనంగా టీజర్ రిలీజ్ వేడుక | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న సినిమా అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

News18
News18

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వినూత్న ప్రేమ కథా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది.

ఆంధ్రప్రదేశ్ ఫిలిం డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్, ఫిలిం చాంబర్ ప్రధాన కార్యదర్శి కే అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య, సీనియర్ ఫిలిం జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ వేడుకలో పాల్గొన్నారు. “తొలి చిత్రంతోనే అన్ని శాఖల పట్ల అవగాహన పెంచుకున్న శైలుజా రెడ్డి సినిమా నిర్మాణ రంగంలోనూ అసాధారణ విజయం సాధించడం ఖాయమని” అతిథులు ఆకాంక్షించారు. “హీరోగా పరిచయమవుతున్న పవన్ మహావీర్ ను చూస్తుంటే… ఇది అతని తొలి చిత్రం అనిపించలేదని, అతనిలో అంత ఈజ్ ఉందని” అన్నారు. “లండన్ లో మెడిసిన్ చదువుతున్న పవన్ మహావీర్ టాలీవుడ్ కు దొరికిన మరో మంచి హీరో” అని కొనియాడారు.

“అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” చిత్రం అత్యద్భుతంగా రూపొందడంలో సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, టీజర్ విడుదలకు అతిథులుగా విచ్చేసిన చిత్ర ప్రముఖులకు నిర్మాత శైలజ రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్ లకు ఉజ్వల భవిష్యత్తు ఉందని దర్శకుడు శివాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల హీరోయిన్స్ వర్షిక, సుహానా, సుజాత, చైల్డ్ ఆర్టిస్ట్ సుప్రీతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed