FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అపశృతి.. మైదానంలో కుప్పకూలిన క్రిస్టియన్.. మ్యాచ్ రద్దు! | క్రీడా వార్తలు | ACTPnews

PC : Reuters


Last Updated:

34 ఏళ్ల ఎరిక్సన్ ఒక్కసారిగా తన ఛాతీని పట్టుకుని మైదానంలో పడిపోయాడు. ఇది గమనించిన తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

PC : Reuters
PC : Reuters

FIFA World Cup 2026: డెన్మార్క్ స్టార్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్సన్ మరోసారి మైదానంలోనే కుప్పకూలడం తీవ్ర కలకలం రేపింది. ఆదివారం ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026లో భాగంగా ఉక్రెయిన్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ మ్యాచ్‌ను వెంటనే రద్దు చేశారు.

ఏం జరిగిందంటే?

డెన్మార్క్, ఉక్రెయిన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో డెన్మార్క్ 2-1 ఆధిక్యంలో ఉన్న సమయంలో.. ఆట 79వ నిమిషానికి చేరుకోగానే 34 ఏళ్ల ఎరిక్సన్ ఒక్కసారిగా తన ఛాతీని పట్టుకుని మైదానంలో పడిపోయాడు. ఇది గమనించిన తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే మెడికల్ సిబ్బంది మైదానంలోకి దూసుకెళ్లి అతనికి అత్యవసర చికిత్స అందించారు.

చికిత్స తర్వాత ఎరిక్సన్ త్వరగానే స్పృహలోకి వచ్చాడని, స్వయంగా నడుచుకుంటూ మైదానం వెలుపలికి వెళ్లాడని అధికారులు తెలిపారు. ఆ తర్వాత తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిరంగానే ఉందని డెన్మార్క్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

పేస్‌మేకర్ కాపాడింది

డెన్మార్క్ జట్టు డాక్టర్ మోర్టన్ బోసెన్ మాట్లాడుతూ.. “ఎరిక్సన్ శరీరంలో అమర్చిన పేస్‌మేకర్ (ICD) సరిగ్గా పనిచేసింది. అతను కొద్దిసేపు స్పృహ కోల్పోయినప్పటికీ, చాలా త్వరగా కోలుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయి. తాను బాగున్నానని తోటి ఆటగాళ్లకు చెప్పమని క్రిస్టియన్ నాతో అన్నాడు” అని తెలిపారు.

ఐదేళ్ల క్రితం నాటి చేదు జ్ఞాపకాలు

ఎరిక్సన్ ఇలా మైదానంలో కుప్పకూలడం ఇది రెండోసారి. 2021 జూన్‌లో జరిగిన యూరో కప్‌లో ఫిన్లాండ్‌తో మ్యాచ్ ఆడుతుండగా ఎరిక్సన్‌కు గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) వచ్చింది. అప్పట్లో వైద్యులు మైదానంలోనే సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత అతడి గుండెకు ఐసీడీ అనే పేస్‌మేకర్ పరికరాన్ని అమర్చారు. ఆ ప్రమాదం నుంచి కోలుకుని మళ్లీ ఫుట్‌బాల్ ఆడుతూ అద్భుత పునరాగమనం చేసిన ఎరిక్సన్, ప్రస్తుతం జర్మన్ క్లబ్ ‘వీఎఫ్ఎల్ వోల్ఫ్స్‌బర్గ్’ తరఫున ఆడుతున్నాడు. ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే తరహాలో అతను మైదానంలో పడిపోవడంతో క్రీడాలోకం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports