Last Updated:
Karthika Deepam Serial Today June 14th Review: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఈ వారం జూన్ 8నుంచి జూన్ 13 వరకు జరిగిన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Karthika Deepam Serial Today June 14th Review: ‘స్టార్ మా’ ఛానెల్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న ‘కార్తీకదీపం 2’ సీరియల్ ఈ వారం (జూన్ 8 నుండి జూన్ 13 వరకు) పెను మలుపులతో, హై-వోల్టేజ్ డ్రామాతో సాగింది. జ్యోత్స్న కుట్రలు, దీప హోటల్ బ్రాంచ్‌ను దెబ్బతీసేందుకు జరిగిన బొద్దింక ప్లాన్ రివర్స్ అవ్వడం, సుమిత్ర దంపతులు, శివన్నారాయణల ముందు జ్యోత్స్న నిజస్వరూపం బయటపడటం వంటి ఆసక్తికర పరిణామాలు ఈ వారం చోటుచేసుకున్నాయి. వీటన్నింటికీ తోడు జ్యోత్స్నకు సూరజ్ ‘ఐ లవ్ యు’ చెప్పడం కథను మరింత రసవత్తరంగా మార్చింది. ఈ వారం ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జూన్ 8వ ఎపిసోడ్ లో సూరజ్ ని అసిస్టెంట్ గా పెట్టుకొని చావు దెబ్బ కొట్టింది అని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. సూరజ్ తో జాగ్రత్తగా ఉండు అతనితో పెట్టుకోవద్దు అని సలహా ఇస్తుంది పారిజాతం. అంతలోనే సూరజ్ జ్యోత్స్న కి ఫోన్ చేసి మీరు నన్ను అస్తమానం తలుచుకోవద్దు నేను పొల మారుతున్నాను ఈ రాత్రికి హాయిగా నిద్రపో ఎందుకంటే రేపటి నుంచి నిద్ర ఉండదు అని హెచ్చరించి ఫోన్ పెట్టేస్తాడు సూరజ్. మరోవైపు ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో శౌర్యకి కనిపించడంతో అతని గురించిన ప్రస్తావన అందరి మధ్య వస్తుంది అప్పుడు దక్షిణామూర్తికి తనకి మధ్య జరిగిన గొడవ గురించి కార్తీక్ వాళ్ళకి చెప్తాడు శివన్నారాయణ.
జూన్ 9 వ ఎపిసోడ్ లో సూరజ్ దీప వెనుక ఉన్న వాల్ క్లాక్ చూస్తూ ఇప్పటివరకు మీ టైం అయింది ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది అనిపిస్తుంది అంటాడు. మరోవైపు దీప కార్తీక్ దక్షిణామూర్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నా తండ్రి చావు కోరుకున్న కుటుంబం నాకు అవసరం లేదు అంటుంది దీప. మరోవైపు దీప బ్రాంచ్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని ఫోన్ రావడంతో అందరూ ఆ బ్రాంచ్ కి వెళ్తారు. అక్కడ ఫుడ్ లో బొద్దింక పడిందని ఒక వ్యక్తి గొడవ చేస్తుంటే సూరజ్ తెలివిగా ఆ గొడవ జ్యోత్స్న చేయిస్తుంది అని ఆధారాలతో సహా తెలుసుకుంటాడు.
జూన్ 10వ ఎపిసోడ్ లో జ్యోత్స్న ఈ పని చేసింది అని శివన్నారాయణ గారికి ఎందుకు చెప్పనివ్వలేదు అంటాడు సూరజ్. అలా చేస్తే ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి అని రెస్టారెంట్ పరువు పోతుంది అంటుంది దీప. సీన్ కట్ చేస్తే ఫుడ్ లో బుద్ధి ఇంకా పడింది అని గొడవ చేసిన వ్యక్తిని ఇంటికి తీసుకు వచ్చి జ్యోత్స్న ఇదంతా చేయించింది అని అతనితోనే చెప్పిస్తారు కార్తీక్ వాళ్లు. కోపంతో కూతురు చెంప పగలకొట్టాలనుకుంటుంది సుమిత్ర కానీ నిన్ను సరిగా పెంచలేని మమ్మల్ని మేము దండించుకోవాలి అంటూ ఆగిపోతుంది శివన్నారాయణ మనవరాలిని అసహ్యించుకొని ఈరోజు నుంచి నా కుటుంబంలో వ్యక్తిగా నువ్వు ఉండవు అంటాడు.
జూన్ 11ఎపిసోడ్ లో మన కుటుంబంలో ఎవరికీ లేని విపరీతమైన బుద్ధులన్నీ దీనిలోనే కనబడుతున్నాయి అంటూ కూతురుపై కోప్పడుతుంది సుమిత్ర. మీరు ఉసిగొలిపిన కుక్కలు ప్రతిసారి ఎదుటి వాళ్ళనే కరుస్తాయి అనుకోకండి అప్పుడప్పుడు మీ వైపు కూడా తిరుగుతాయి ఇకపై ఇలాంటి పనులు చేయకండి అని చెప్పి బయటకు వచ్చేస్తాడు సూరజ్. అతని వెనకే జ్యోత్స్న కూడా వచ్చి అతని చెంప పగల కొడుతుంది నా ఇంట్లో వాళ్ల ముందే నన్ను పనికిరాని మనిషిగా నిలబెట్టావు ఇకపై రోజులు లెక్క పెట్టుకో అంటూ సూరజ్ ని హెచ్చరిస్తుంది. నీకు సీరియస్ గా ఒక మాట చెప్పనా అంటూ జ్యోత్స్న కి ఐ లవ్ యు చెప్తాడు సూరజ్. సీన్ కట్ చేస్తే జ్యోత్స్న వల్ల నేను నా కుటుంబానికి దగ్గరయ్యాను అందుకు దీనికి థాంక్స్ చెప్పాలి అంటుంది దీపం నేను కూడా థాంక్స్ చెప్తాను అంటూ కార్తీక్ దీపం ఇద్దరు జ్యోత్స్న చెంపలు గట్టిగా గిల్లుతారు. మరోవైపు కూతురి ప్రవర్తన సరిగ్గా లేదని దీప దగ్గర బాధపడుతుంది సుమిత్ర.
జూన్ 12వ ఎపిసోడ్ లో జ్యోత్స్న ఇంట్లో అందరినీ సమావేశపరిచి నేను నా తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను నేను తప్పు చేశాను అందుకు దీపకి క్షమాపణ చెప్పుకోవాలనుకుంటున్నాను అంటూ దీపకి క్షమాపణ చెప్తుంది అలాగే నేను పెట్టిన కండిషన్ కూడా వెనక్కి తీసుకుంటున్నాను బావ తన ఫ్యామిలీతో తన ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటుంది. మరోవైపు దీప భర్తతో మాట్లాడుతూ చాలా తెలివిగా తప్పించుకుంది ఒక్క క్షమాపణతో అందరి కోపాన్ని పోగొట్టింది అంటుంది. మరోవైపు శివన్నారాయణ, జ్యోత్స్న కారులో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న కారు ఒక దగ్గర ఆపడంతో రౌడీలు ఆమె కారు దగ్గరికి వచ్చి బయటికి రమ్మని సైగ చేస్తారు. వాళ్ళు ఎవరు అని శివన్నారాయణ అడిగితే చందాల కోసం అయి ఉంటుంది నేను మాట్లాడుతాను అంటూ కారు దిగి రౌడీలతో మాట్లాడుతుంది జ్యోత్స్న. రౌడీలు జ్యోత్స్న ని డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా ఆమెని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తారు అప్పుడే సూరజ్ వచ్చి ఆమెని కాపాడుతాడు.
జూన్ 13వ ఎపిసోడ్ లో తనకు వచ్చిన మెయిల్ చదవమని మేనేజర్ తో చెప్తుంది దీప నా మీద నమ్మకం లేదు కదా మీరు సూరజ్ గారితోనే చదివించుకోండి అంటాడు మేనేజర్. మరోవైపు కాలికి కట్టుతోనే ఆఫీస్ కి వచ్చిన సూరజ్ ని చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. సూరజ్ జ్యోత్స్న కి హెల్ప్ చేసినా ఆమె సూరజ్ కి థాంక్స్ చెప్పలేనందుకు జ్యోత్స్న ని తిట్టుకుంటారు దీప దంపతులు. మరోవైపు సూరజ్ మాటలలో ఆఫీస్ కి దగ్గరలో రూమ్ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుసుకుంటాడు శివన్నారాయణ. అతడిని ఇంటికి పిలిపించి నువ్వు మా గెస్ట్ హౌస్ లో ఉండొచ్చు అని చెప్తాడు.
మొత్తానికి ఈ వారం ‘కార్తీకదీపం 2’ సీరియల్ జ్యోత్స్న ప్లాన్ రివర్స్ అవ్వడం, ఇంట్లో వాళ్లందరి ముందు ఆమె పరువు పోవడంతో ఉత్కంఠభరితంగా సాగింది. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జ్యోత్స్న దీపకు క్షమాపణ చెప్పి ఒక మెట్టు దిగినా, ఆమె వెనుక ఏ పెద్ద స్కెచ్ ఉందో అనే అనుమానం మాత్రం అలాగే ఉంది. మరోవైపు, రౌడీల నుండి జ్యోత్స్నను ప్రాణాలకు తెగించి కాపాడిన సూరజ్‌పై శివన్నారాయణకు నమ్మకం పెరగడం, అతడిని తమ గెస్ట్ హౌస్‌లోనే ఉండమని పిలవడం కథను కొత్త మలుపు తిప్పింది. మరి జ్యోత్స్నపై సూరజ్ పెంచుకున్న ఈ ‘ఐ లవ్ యు’ ఫోకస్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? సూరజ్ గెస్ట్ హౌస్‌లోకి అడుగుపెడితే జ్యోత్స్న పరిస్థితి ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌తో ఈ వారం ఎపిసోడ్స్ ముగిశాయి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌ల కోసం వేచి చూడాల్సిందే!
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













