Hyderabad | హైదరాబాద్‌లో కల్తీ పనీర్ మాఫియాపై భారీగా దాడులు! | | ACTPnews

Hyderabad | హైదరాబాద్‌లో కల్తీ పనీర్ మాఫియాపై భారీగా దాడులు! |


Last Updated: Jun 18, 2026, 16:31 IST

హైదరాబాద్ నగరంలో కల్తీ పనీర్ తయారీ, విక్రయాలపై టాస్క్ఫోర్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా భారీ దాడులు నిర్వహించారు. నగరంలోని 45 ఫుడ్ అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లలో జరిపిన తనిఖీల్లో దాదాపు 825 కిలోల ప్రమాదకరమైన కల్తీ పనీర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్లను ఆకర్షించడానికి “లో ఫ్యాట్”, “ఫ్రెష్ పనీర్” పేర్లతో ‘చీజ్ అనలాగ్’ను అసలైన పనీర్గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండా సింథటిక్ పాలు, స్టార్చ్, నాన్-మిల్క్ ఫ్యాట్స్ మరియు నాసిరకం పదార్థాలతో ఈ నకిలీ పనీర్ తయారు చేస్తున్న ముఠాల బండారాన్ని అధికారులు బట్టబయలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports