కోహ్లీ, రోహిత్, బుమ్రా ఇన్.. హార్దిక్, జైశ్వాల్ ఔట్.. ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు ఇదే | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఇంగ్లండ్ పర్యటనకు భారత వన్డే జట్టును ప్రకటించారు. జులై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ఫిట్‌నెస్ లేకపోవడంతో హార్దిక్ పాండ్యా దూరమవ్వగా, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనున్నారు.

News18
News18

రాబోయే ఇంగ్లండ్ కీలక పర్యటన కోసం భారత వన్డే క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. జులై 1వ తేదీన నుంచి మొదలవుతున్న ఈ ప్రతిష్టాత్మక టూర్ కోసం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా రంగంలోకి దిగనున్నారు. ఇక ఐపీఎల్‌లో గాయపడిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఫిట్‌నెస్ సాధించకపోవడమే అతడికి జట్టులో చోటు దక్కకపోవడానికి ప్రధాన కారణం. ఇటీవల ఐపీఎల్‌తో పాటు, ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న సిరీస్‌లో రాణించిన యశస్వీ జైశ్వాల్‌కు చోటు దక్కలేదు. మొత్తంగా ఇంగ్లండ్ గడ్డపై ఐదు టీ20లు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్ జరగనుంది. జులై 19వ తేదీ వరకు ఈ మ్యాచ్‌లు ఉంటాయి.

మూడేళ్ల తర్వాత జట్టులోకి..

ఇక స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దాదాపు మూడేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్ లోకి మళ్లీ అడుగుపెడుతున్నాడు. అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాపై జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత బుమ్రా మళ్లీ వన్డే మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2026 సీజన్ పూర్తయిన తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం బుమ్రాకు ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ పూర్తి యూరప్ పర్యటన ముందుగా ఐర్లాండ్ తో జరిగే రెండు టీ20 మ్యాచ్ లతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ లో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్ లు ఆడుతుంది.

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

ఇంగ్లండ్ టూర్ పూర్తి షెడ్యూల్:

టీ20 సిరీస్:

తొలి టీ20: జులై 1 – చెస్టర్ లీ స్ట్రీట్

రెండో టీ20: జులై 4 – మాంచెస్టర్

మూడో టీ20: జులై 7 – నాటింగ్‌హామ్

నాలుగో టీ20: జులై 9 – బ్రిస్టల్

ఐదో టీ20: జులై 11 – సౌతాంప్టన్

వన్డే సిరీస్:

తొలి వన్డే: జులై 14 – ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్)

రెండో వన్డే: జులై 16 – కార్డిఫ్

మూడో వన్డే: జులై 19 – లార్డ్స్

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed