Last Updated:
ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ తాజాగా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. ఆ వివరాలు చూద్దామా..
పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఫౌజీ’ (Fauji). తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘సీతా రామం’ లాంటి అద్భుతమైన క్లాసిక్ హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొల్పుకుంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంగా సాగే ఒక ఫిక్షనల్ హిస్టారికల్ లవ్ డ్రామా. గత కొన్ని రోజులుగా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తూ, 2026 డిసెంబర్ 3న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ”అజ్ఞాతపర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలవుతోంది” అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో ఉన్న ఈ పోస్టర్లో ప్రభాస్ ఊరమాస్ లుక్ కట్టిపడేస్తోంది. శవాల గుట్టల మధ్య, రక్తం అంటిన దేహంతో, షర్ట్ లేకుండా ఒక బండరాయిపై ప్రభాస్ తీక్షణంగా చూస్తూ కూర్చున్న తీరు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. చేతిలో ఒక భారీ తుపాకీ పట్టుకుని, ఒంటిపై జంధ్యం కనిపిస్తుండటం ఈ కథలోని పాత్రపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. సలార్, కల్కి 2898 ఏడీ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ లుక్ వైరల్ అవుతోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్ సరసన పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. సీనియర్ నటి జయప్రద, బాలీవుడ్ దిగ్గజాలు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, రాజేష్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత కమల్ కణ్ణన్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ సంస్థ టీ-సిరీస్ (T-Series), గుల్షన్ కుమార్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














