Abhijit Dipke: అభిజిత్ దిప్కే ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. సీజేపీ నేత ఇంటికి వెళ్లడానికి పోలీసులు అనుమతిస్తారో లేదో..! | | ACTPnews

Abhijit Dipke


Last Updated:

Delhi: ఢిల్లీలో తలపెట్టిన నిరసన కోసం రాజధానికి చేరుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఓవైపు ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ చేపట్టిన నిరసన కొనసాగుతున్న సమయంలోనే అభిజిత్‌ని పోలీసులు ఫ్లైట్‌లోనే అదుపులోకి తీసుకున్నారు. దీని తర్వాతే ఆయన విషాదవార్త తెలిసింది.

Abhijit Dipke
Abhijit Dipke

Abhijit Dipke: ఢిల్లీలో తలపెట్టిన నిరసన కోసం రాజధానికి చేరుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం అక్రమ నిర్వహణకు నిరసనగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న యువత ఈ కార్యక్రమం కోసం అక్కడ సమావేశమయ్యారు. ఈ నిరసనకు నాయకత్వం వహిస్తున్న అభిజిత్ దిప్కే అతని సహచరులు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభిజిత్ దిప్కే పోలీసుల అదుపులో ఉన్న సమయంలోనే అతని కుటుంబానికి ఒక తీవ్రమైన విషాదం ఎదురైంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న నానమ్మ జల్నాలో కన్నుమూశారు.

విషాదం..

అభిజిత్ దిప్కే స్వగ్రామం హింగోలి జిల్లాలోని ‘సంతుక్ పింప్రి’. ఈ గ్రామంలోనే ఆయన నానమ్మ తుదిశ్వాస విడిచారు. అభిజిత్ కుటుంబం ఛత్రపతి సంభాజీనగర్‌లో నివసిస్తోంది. తండ్రి ఉద్యోగరీత్యా వారు అక్కడికి మారినప్పటికీ ఆయన నానమ్మ మాత్రం తమ స్వగ్రామంలోనే ఉంటోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం తుదిశ్వాసవిడిచారు.

నానమ్మతో అభిజిత్(ఫైల్ ఫోటో)
CJP నాయకుల ముందస్తు అరెస్టులు..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అభిజిత్ దిప్కే నిరసన చేపట్టనున్నారు. దీనికి ముందుగానే ధ్రువ్ రాఠీ, తుషార్ గాంధీ, అభిజిత్ దిప్కే, అశుతోష్ రంకా , సౌరవ్ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను CJP ఖండించింది. స్టూడెంట్స్ నాయకుల్ని తీవ్రవాదులుగా ట్రీట్‌చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విమానం దిగిన తర్వాత అదుపులోకి

అభిజిత్ దిప్కేను విమానం నుండి అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంపై ఆయన తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల కోసం గళమెత్తిన వారిని ఈ విధంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల

స్మగ్లర్లు వారికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. విమానం నుంచి అభిజిత్‌ను ఏ చట్టం కింద అదుపులోకి తీసుకున్నారో వివరించాలని వారు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఒక విద్యార్థిని ఈ విధంగా అదుపులోకి తీసుకోవడం చరిత్రలోనే ఇదే మొదటి సంఘటన అని కూడా వారు పేర్కొన్నారు.

అనుమతిస్తారో లేదో..

సొంత నాయనమ్మ చనిపోయిన సమయంలో అభిజీత్ ఢిల్లీలో పోలీసుల అదుపులో ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఈ కష్ట సమయంలో కుటుంబంతో ఉండేందుకు ఆయనకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభిజిత్ తండ్రి భగవాన్ దిప్కే తల్లే చనిపోయింది. గత కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యం, వయసురీత్యా సమస్యలతో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports