Last Updated:
పెళ్లి పేరుతో మోసం చేసి, లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్, యువ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (Abhishek Porel) తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి మోసం చేయడంతో పాటు, లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో మంగళవారం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు కఠిన ఆదేశాల మేరకు బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా మగ్రా పోలీసులు ఈ సంచలన చర్యలు తీసుకున్నారు. పోరెల్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని, ఆ తర్వాత అభ్యంతరకరమైన ఫోటోలు చూపిస్తూ తీవ్రంగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు హిందుస్తాన్ టైమ్స్ కథనం పేర్కొంది.














