IRCTC Andaman Tour: అండమాన్‌లో 6 రాత్రులు… హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ | | ACTPnews

IRCTC Andaman Tour: అండమాన్‌లో 6 రాత్రులు... హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ సూపర్ ప్యాకేజీ |


టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.87,700, డబుల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.67,300, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కరికి రూ.65,200 చెల్లించాలి. ఈ ప్యాకేజీకి మొత్తం 29 మంది ప్రయాణికులతో గ్రూప్‌ను ప్లాన్ చేశారు. ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లేందుకు, తిరిగి రావడానికి విమాన టికెట్లు ప్యాకేజీలో ఉన్నాయి. చెన్నై కనెక్షన్ కూడా ఇందులోనే ఉంటుంది. టూర్‌లో ఉండే అన్ని ప్రాంతాల్లో ఏసీ హోటల్ వసతి కల్పిస్తారు. సైట్‌సీయింగ్, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఏసీ వాహనాన్ని పాయింట్-టు-పాయింట్ విధానంలో ఏర్పాటు చేస్తారు. అంటే మొత్తం టూర్ సమయంలో వాహనం ప్రయాణికుల దగ్గరే అందుబాటులో ఉండదు. హ్యావ్‌లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్‌కు వెళ్లి తిరిగి రావడానికి అవసరమైన ఫెర్రీ చార్జీలు కూడా ప్యాకేజీలో ఉంటాయి. పూర్తి రోజు టూర్లు, ఎయిర్‌పోర్ట్ పికప్, డ్రాప్ సేవలు కూడా ఇందులో ఉన్నాయి. భోజనం ఎంఏపీ (మాడిఫైడ్ అమెరికన్ ప్లాన్) విధానంలో ఉంటుంది. ఇందులో ఆరు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఆరు డిన్నర్లు ఇస్తారు. వర్తించే పన్నులు, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు కూడా ప్యాకేజీలో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *