AIMIM MLC Suspension: ఎంఐఎంలో నాటకీయ పరిణామాలు.. నేడో, రేపో మజ్లిస్ ఎమ్మెల్సీ రహమత్ బేగ్ రాజీనామా! | తెలంగాణ వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

AIMIM MLC Suspension: ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీలో తీవ్ర రాజకీయ కలకలం రేగింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న ఆరోపణలతో బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

PC: X.com
PC: X.com

ఆయన మంగళవారం లేదా బుధవారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని స్వయంగా కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వివాదాల్లో చిక్కుకున్న మీర్జా రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గౌరవానికి భంగం వాటిల్లే చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన అధినేత, వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా, పార్టీకి సంబంధించిన సమగ్ర రికార్డులతో పాటు, ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు జారీ చేసిన అధికారిక లేఖల ప్రతులను తక్షణమే దారుస్సలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. అధిష్ఠానం నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేతల ద్వారా తెలుసుకున్న రహ్మత్ బేగ్.. తన పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed