All Party Meet: అఖిల పక్ష సమావేశంలో రచ్చ.. విపక్షాల వాకౌట్.. తృణమూల్ కాంగ్రెస్ రెబల్స్ పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం! | | ACTPnews

ఆల్ పార్టీ మీటింగ్ నుంచి విపక్షలా బాయ్ కాట్


Last Updated:

All Party Meet: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సాంప్రదాయ అఖిల పక్ష సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఆల్ పార్టీ మీటింగ్ నుంచి విపక్షలా బాయ్ కాట్
ఆల్ పార్టీ మీటింగ్ నుంచి విపక్షలా బాయ్ కాట్

తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన పలువురు తిరుగుబాటు ఎంపీలతో కొత్తగా ఏర్పడిన ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI) సమావేశంలో పాల్గొనడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే వారు తిరిగి సమావేశానికి హాజరయ్యారు. గత నెలలో దాదాపు 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు ఎన్‌సీపీఐ (NCPI) లో విలీనమయ్యారు. అయితే, ఈ విలీనానికి ఇంకా అధికారికంగా ఆమోదం లభించనందున, ఈ కొత్త పార్టీని అఖిల పక్ష సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

పార్లమెంట్ వెబ్‌సైట్‌లో ఇంకా మారలేదు – మహువా మోయిత్రా

ఈ విలీనం జరిగి రోజులు గడుస్తున్నా, పార్లమెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం సదరు 20 మంది తిరుగుబాటు ఎంపీలను ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులుగానే చూపిస్తుండటం గమనార్హం. దీనిపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా మండిపడ్డారు. “ఏ ప్రాతిపదికన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వారిని ఈ అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించారు? పార్లమెంట్ రికార్డుల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ బలం ఇప్పటికీ 28 మంది ఎంపీలుగానే చూపిస్తోంది” అని ఆమె ప్రశ్నించారు. విపక్షాల వాకౌట్ కేవలం ఒక సంకేత నిరసన మాత్రమే కావడంతో, కొన్ని నిమిషాల్లోనే నేతలతో పాటు మళ్లీ లోపలికి వచ్చారు.

మమ్మల్ని ఆహ్వానించారు.. వస్తాం: సుదీప్ బందోపాధ్యాయ

మరోవైపు, ఎన్‌సీపీఐ పక్ష నేత కాకొలి ఘోష్ దస్తీదార్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమ పార్టీని అనుమతించినందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. టీఎంసీ రెబల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. “మాకు ఆహ్వానం అందింది, 20 మంది ఎంపీలు ఉన్న కొత్త పార్టీ తరపున మేము హాజరయ్యాం. సభ అనేది ప్రతిపక్షానికి కూడా చెందుతుందని గుర్తించాలి. సభ సజావుగా సాగేందుకు ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. లౌకికవాదం, మత సామరస్యం, జాతీయ సమగ్రత అనే మా పార్టీ సిద్ధాంతాలకు మేము కట్టుబడి ఉన్నాం. ఎన్‌సీపీఐని స్థాపించిన 20 మంది ఎంపీలలో ముగ్గురు ముస్లింలు ఉన్నారు, ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం” అని పేర్కొన్నారు.

సభ అందరిది.. సహకరించండి: కిరణ్ రిజిజు

ఈ సమావేశానికి ముందు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. “రేపటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతున్నాం” అని అన్నారు.

పార్లమెంట్ అనేది అందరికీ చెందుతుందని, చట్టసభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తాయని ఆశిస్తున్నట్లు రిజిజు తెలిపారు. “పార్లమెంట్ ఎంత బాగా పనిచేస్తే, దేశానికి అంత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. మేము ప్రతిపక్షాల మాట వింటాం, వారు కూడా మా మాట వింటారని ఆశిస్తున్నాం” అని ఆయన నేతలను కోరారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports