Allu Arjun: రాకా గిన్నిస్‌ రికార్డు సాధించిందిలా..! వీడియో వదిలిన అల్లు అర్జున్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

అల్లు అర్జున్‌ (Allu Arjun)- అట్లీ (Atli) కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాకా’. తాజాగా ఈ సినిమా ‘రాకా’ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోగా.. అందుకు సంబంధించిన స్పెషల్ వీడియో షేర్ చేశారు అల్లు అర్జున్.

News18
News18

అల్లు అర్జున్‌ (Allu Arjun)- అట్లీ (Atli) కాంబోలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ‘రాకా’. ఈ సినిమాలో దీపిక పదుకొణె హీరోయిన్‌. భారీ అంచనాల నడుమ ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ‘రాకా’ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది.

‘రాకా’ కోసం ఏకంగా 37 మంది నటీనటుల హావభావాలను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా రియల్‌టైమ్‌లో చిత్రీకరించారు. ఒకే ప్రాజెక్ట్‌లో ఇంతమంది నటీనటులను ఈ విధంగా రియల్‌టైమ్ మోషన్ క్యాప్చర్ చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు అందించిన సర్టిఫికెట్‌ను దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్‌కు అందజేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించిన నాలుగు నిమిషాల మేకింగ్‌ వీడియో గ్లింప్స్‌ను అల్లు అర్జున్‌ షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రాకా’ కథ మూడు విభిన్న కాలాల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. పురాణాలు, ఆధునిక కాలం అంశాలను మేళవిస్తూ ఈ కథను అట్లీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా కథ, విజువల్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉండటం మరో అట్రాక్షన్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports