Last Updated:
మిడిల్ క్లాస్ బతుకుల్ని అద్దం పట్టేలా ‘కాసుల కళ’ అంటూ సాగే పాటను విడుదల చేసింది అమీర్ లోగ్ టీం. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది.
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు.
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలన్నీ కూడా చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. తాజాగా ఈ మూవీ సోల్‌ని చెప్పే ఓ అందమైన గీతాన్ని వదిలారు. మిడిల్ క్లాస్ బతుకుల్ని అద్దం పట్టేలా ‘కాసుల కళ’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. కాసుల కళ పేరుతో వచ్చిన ఈ పాట మధ్యతరగతి కుటుంబాల ఆశలు, కష్టాలు, జీవిత పోరాటాన్ని చూపిస్తోంది. ఈ పాటకు నిఖ్లేష్ సుంకోజి సాహిత్యం ఎంతో అర్థవంతంగా ఉంది. ఇక స్మరణ్ సాయి ఇచ్చిన బాణీ అయితే గుండెల్ని తాకేలా ఉంది. ఈ పాటలో ఏక్‌నాథ్ గాత్రం మరింత ఫీల్‌ను ఇస్తోంది.
పక్కా లోకల్ ఫ్లేవర్‌తో హైదరాబాద్‌లోని ఇంకో కోణాన్ని ఆవిష్కరించేలా ‘అమీర్ లోగ్’ ఉండబోతోంది. ఈ మూవీకి ఎస్వీకే కెమెరావర్క్, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆగస్ట్ 21న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సినిమాలో MC హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














