Ameerpet Fire Accident: అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది | తెలంగాణ వార్తలు | ACTPnews

News18


Last Updated:

కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకూ వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు గంటసేపు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.

News18
News18

Ameerpet Fire Accident: అమీర్‌పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ నెంబరు 1043 సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకూ వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. దాదాపు గంటసేపు తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం మైతీవ్రనం పరిసిర ప్రాంతాల్లో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదని తెలుస్తుంది. ఎలివేషన్ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో పొగలు రావడంతో అప్రమత్తమైన ప్రజలు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇక ఆ కాంప్లెక్స్‌లో ఉన్న వారు వెంటనే బయటకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ కాంప్లెక్స్‌లో ఉన్న 20 షాపులు దగ్ధమైనట్లు సమాచారం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత లోపల ఎవరైనా ఉన్నారా అనే దానిపై స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. బట్టల షాపులు, హార్డ్ వేర్ షాపులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports