Last Updated:
నాని సినిమా హీరోయిన్ అమీషా పటేల్ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. తాను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం సింగిల్‌గా ఉండటమే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.
నాని సినిమా హీరోయిన్ అమీషా పటేల్ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. తాను జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, ప్రస్తుతం సింగిల్‌గా ఉండటమే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్లో ఓ అభిమాని.. ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని ప్రశ్నించగా.. ‘నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. ఒక్క వ్యక్తి కోసం నా జీవితాన్ని, నా ఆనందాన్ని పూర్తిగా మార్చుకోవాలని నేను అనుకోవడం లేదు’ అంటూ అమీషా సమాధానం ఇచ్చారు.














