హైదరాబాద్‌లో అమెరికా యూనివర్సిటీ క్యాంపస్… 2027 నుంచి క్లాసులు… ఏ కోర్సులు ఉంటాయంటే? | తెలంగాణ వార్తలు | ACTPnews

హైదరాబాద్‌లో అమెరికా యూనివర్సిటీ క్యాంపస్... 2027 నుంచి క్లాసులు... ఏ కోర్సులు ఉంటాయంటే? | తెలంగాణ వార్తలు

[ad_1]

సీయూ డెన్వర్‌లో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. కెరీర్‌పై దృష్టి పెట్టిన విద్యను అందిస్తూ, వేగంగా మారుతున్న గ్లోబల్ ఎకానమీలో విద్యార్థులు విజయవంతంగా ముందుకు వెళ్లేలా సిద్ధం చేస్తుంది. బలమైన అకడమిక్ పునాది, ప్రాక్టికల్ అనుభవంతో కూడిన లెర్నింగ్ కలిపి అందించడం ద్వారా విద్యార్థులకు తమ సబ్జెక్టుపై లోతైన అవగాహనతో పాటు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు పనిచేసే సామర్థ్యం కూడా లభిస్తాయి. దీంతో వారు చదువును మంచి కెరీర్ అవకాశాలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Solar Power: మీ ఇంటికి ఎంత కెపాసిటీ సోలార్ సరైనది? సబ్సిడీ ఎంతొస్తుంది?

హైదరాబాద్ క్యాంపస్‌లో బిజినెస్, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న రంగాల్లో కోర్సులు అందించనున్నారు. వివిధ సబ్జెక్టులను కలిపి ఆలోచించడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు మంచి నైపుణ్యాలు ఉన్న ప్రొఫెషనల్స్‌గా, కొత్త ఆలోచనలు చేసే వ్యక్తులుగా, ప్రపంచ స్థాయిలో ఆలోచించే నాయకులుగా ఎదిగేలా విద్య అందించనున్నారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి కెరీర్ అవకాశాలు పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. అదే సమయంలో సీయూ డెన్వర్ ప్రధాన క్యాంపస్‌తో విద్యార్థులకు అనుబంధం కొనసాగుతుంది.

సీయూ డెన్వర్ చాన్స్‌లర్ కెన్నెత్ టీ. క్రిస్టెన్సెన్, పీహెచ్‌డీ మాట్లాడుతూ, “నాణ్యమైన విద్య మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం సీయూ డెన్వర్ లక్ష్యాల్లో ఎప్పటినుంచో ముఖ్యమైన భాగం. హైదరాబాద్‌లో మా ప్రణాళికలు కూడా అదే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాయి. దశాబ్దాలుగా భారత్‌కు చెందిన విద్యార్థులు సీయూ డెన్వర్ కమ్యూనిటీలో భాగంగా ఉన్నారు. ఇప్పుడు ఆ అనుబంధాన్ని మరింత విస్తరించే అవకాశం మాకు లభించింది. కఠినమైన అకడమిక్ విద్య, కెరీర్‌కు ఉపయోగపడే లెర్నింగ్, వాస్తవ ప్రపంచ అనుభవాన్ని కలిపి భారత్‌లోని విద్యార్థులకు అందించాలనుకుంటున్నాం. తద్వారా వారు మంచి కెరీర్‌లను నిర్మించుకోవడంతో పాటు తమ కమ్యూనిటీలకు కూడా ఉపయోగపడేలా సిద్ధమవుతారు” అని చెప్పారు.

గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ ఎమెరిటస్ భారత్‌లో సీయూ డెన్వర్‌కు స్ట్రాటజిక్ జాయింట్ వెంచర్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది. క్యాంపస్‌ను విజయవంతంగా ఏర్పాటు చేయడం, దాని అభివృద్ధికి అవసరమైన కీలక నాన్-అకడమిక్ విభాగాల్లో తన అనుభవంతో యూనివర్సిటీకి ఎమెరిటస్ సహకరించనుంది. ఎమెరిటస్ కో-ఫౌండర్, సీఈఓ అశ్విన్ డామెరా మాట్లాడుతూ, “ప్రతిపాదిత యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్, హైదరాబాద్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడే విద్యను భారత్‌లోని విద్యార్థులకు మరింత దగ్గరగా తీసుకురావడంలో ఒక ముఖ్యమైన అడుగు పడుతోంది. ప్రాక్టికల్ లెర్నింగ్, వివిధ సబ్జెక్టులను కలిపి నేర్చుకోవడం, కెరీర్‌కు సిద్ధం చేయడంపై సీయూ డెన్వర్ దృష్టి పెట్టడం నేటి విద్యార్థుల ఆశయాలకు, వేగంగా మారుతున్న ఉద్యోగ రంగం అవసరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు, అకడమిక్‌గా బలమైన విద్యను ఉద్యోగ ప్రపంచంతో నేరుగా అనుసంధానం చేసే అవకాశం కూడా ఈ కార్యక్రమం ద్వారా పెరుగుతుంది” అని అన్నారు.

ఇది కూడా చదవండి: OnePlus Offers: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు పండగే… రూ.14,999కే ఫోన్! ఈ ఆఫర్లు మిస్ కావద్దు

హైదరాబాద్‌లో సీయూ డెన్వర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక భారత్‌లోని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) 2020 లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. ఇందులో మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్, అంతర్జాతీయ విద్యా అవకాశాలు, విద్యార్థుల అభ్యాస ఫలితాలు, కెరీర్‌కు సిద్ధం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంది. 1973లో ప్రారంభమైన సీయూ డెన్వర్‌ను యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బోర్డ్ ఆఫ్ రీజెంట్స్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం దాదాపు 14,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. 100కు పైగా దేశాల్లో 1 లక్షకు పైగా పూర్వ విద్యార్థులతో దీనికి గ్లోబల్ అలుమ్ని నెట్‌వర్క్ ఉంది.

సీయూ డెన్వర్‌ను కార్నెగీ కమిషన్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్1 రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌గా గుర్తించింది. అంటే యూనివర్సిటీలో పరిశోధన కార్యకలాపాలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయని అర్థం. విద్యార్థులు, కమ్యూనిటీలు, పరిశ్రమలకు అవసరమైన విషయాలతో అకడమిక్ లెర్నింగ్‌ను అనుసంధానం చేయడంపై కూడా యూనివర్సిటీ దృష్టి పెడుతోంది. సామాజిక, ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు విద్య ఉపయోగపడేలా చేయడం, ఉద్యోగ రంగానికి అవసరమైన నైపుణ్యాలను అందించడం కూడా దీని ముఖ్యమైన లక్ష్యాల్లో ఉన్నాయి. కొలరాడోలోని ప్రముఖ పబ్లిక్ అర్బన్ రీసెర్చ్ యూనివర్సిటీగా సీయూ డెన్వర్ ప్రభావం చూపే పరిశోధనలు, సమాజంతో అనుసంధానం, కెరీర్‌పై దృష్టి పెట్టిన అకడమిక్ ప్రోగ్రామ్‌లపై ఫోకస్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Washing Machine Offer: సెమీ ఆటోమెటిక్ ధరకే ఫుల్లీ ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్

హైదరాబాద్‌లో సీయూ డెన్వర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంతో అనుసంధానమైన నాణ్యమైన విద్యను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలన్న యూనివర్సిటీ లక్ష్యం ముందుకు సాగనుంది. విద్యార్థులు, ఉద్యోగాలు కల్పించే సంస్థల అవసరాలు మారుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా ఈ సంస్థను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సీయూ డెన్వర్ అవసరమైన రెగ్యులేటరీ ప్రక్రియలను కొనసాగిస్తూ, అకడమిక్ సంస్థలు, పరిశ్రమలు, ఇతర సంబంధిత వర్గాలతో కలిసి పనిచేయనుంది.

అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే 2027 ఆగస్టులో హైదరాబాద్ క్యాంపస్‌లో తొలి బ్యాచ్ విద్యార్థులకు స్వాగతం పలకాలని సీయూ డెన్వర్ లక్ష్యంగా పెట్టుకుంది. రెండో ఏడాది నుంచి మరిన్ని కోర్సులను యూజీసీ అనుమతి కోసం ప్రతిపాదించనుంది. మొత్తంగా చూస్తే, హైదరాబాద్‌లో సీయూ డెన్వర్ క్యాంపస్ రావడం వల్ల అంతర్జాతీయ స్థాయి విద్యను భారత్‌లోనే పొందాలనుకునే విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports