Anakapalli Review: అనకాపల్లి మూవీ రివ్యూ.. భావోద్వేగాలతో కూడిన ఈ ప్రేమ కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

దర్శకుడు, రచయిత త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు సంయుక్తంగా నిర్మించిన కొత్త సినిమా అనకాపల్లి. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

News18
News18

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ‘రా అండ్ రస్టిక్’ రూరల్ డ్రామాలకు విశేషమైన ఆదరణ దక్కుతోంది. సహజత్వానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కే పల్లెటూరి కథలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. సరిగ్గా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ, స్వచ్ఛమైన గోదావరి జిల్లాల నెటివిటీతో నేడు (అక్టోబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘అనకాపల్లి’. ప్రముఖ దర్శకుడు, రచయిత త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో ఖగేష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథా నేపథ్యం:

కథ అనకాపల్లిలో సాగుతుంది. ఆ ఊరిలో ఏఈగా పనిచేసే సాంబశివరావు (త్రినాథరావు నక్కిన) చాలా నిజాయితీపరుడు. కానీ అతని కొడుకు సూర్య (విక్రమ్ సహిదేవ్)కు తండ్రి మిడిల్ క్లాస్ బతుకు నచ్చదు. అదే ఊరిలో తిరుగులేని రౌడీగా చెలామణి అయ్యే బుల్లెట్ (తారక్ పొన్నప్ప) యాటిట్యూడ్ చూసి ఆకర్షితుడైన సూర్య, అతని గ్యాంగ్‌లో చేరి రైట్ హ్యాండ్‌గా ఎదుగుతాడు. ఈ క్రమంలో సూర్యకు అమృత (సంధ్య వశిష్ట) పరిచయం అవుతుంది. కరెంట్ మీటర్ సమస్య తీర్చే నెపంతో ఆమెకు దగ్గరై పీకల్లోతు ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న తరుణంలో.. తానెంతో ఇష్టపడ్డ అమృత, తన బాస్ బుల్లెట్ ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూసి సూర్య షాక్‌కు గురవుతాడు. అసలు అమృత, బుల్లెట్‌ను ఎలా ఇష్టపడింది? డ్రగ్ డీలర్ నాయుడు (కాండ్రేగుల నాయుడు), బుల్లెట్ మధ్య ఉన్న వైరం ఏంటి? సూర్య ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది మిగతా కథ.

విశ్లేషణ:

యువత పెడదారిన పడితే జీవితాలు ఎలా నాశనం అవుతాయి, పిల్లలు చేసే తప్పులకు తల్లిదండ్రులు అనుభవించే నరకం ఏంటి, ప్రేమకు-ఆకర్షణకు మధ్య ఉన్న సన్నని గీత లాంటి బలమైన పాయింట్లను త్రినాథరావు నక్కిన కథగా మలచగా, దర్శకుడు ఖగేష్ దానిని తెరపై ఆవిష్కరించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా రౌడీయిజం, హీరో ఎలివేషన్స్, లవ్ ట్రాక్‌తో కాస్త నెమ్మదిగా సాగుతుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ జర్నీగా, ఉత్కంఠభరితమైన రివేంజ్ డ్రామాగా నడుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే హార్డ్ హిట్టింగ్ బ్లాక్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.

నటీనటులు, సాంకేతిక వర్గం:

సూర్య పాత్రలో విక్రమ్ సహిదేవ్ అద్భుతంగా నటించాడు. యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ సీన్స్‌లో తనదైన మార్క్ చూపించాడు. విలన్ బుల్లెట్‌గా తారక్ పొన్నప్ప క్రూరమైన నటనతో భయపెడతాడు. హీరోయిన్ సంధ్య వశిష్ట అనకాపల్లి అమ్మాయిలా చాలా న్యాచురల్‌గా కనిపించింది. తల్లిదండ్రులుగా త్రినాథరావు నక్కిన, ఇంద్రజ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. డ్రగ్ డాన్‌గా నిర్మాత నాయుడు తన పాత్రకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. కెమెరా వర్క్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అనకాపల్లి వాతావరణాన్ని, ఆ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాయి. మాటలు, పాటలు కథలో లీనమయ్యేలా చేస్తాయి.

ఫైనల్ గా చెప్పాలంటే..

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, సహజమైన ఎమోషన్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘అనకాపల్లి’ సినిమా ఒక మంచి ఛాయిస్.

రేటింగ్ : 2.75



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports