Anasuya: సోషల్ మీడియాలో అనసూయ అసభ్యకర ఫోటోలు.. సజ్జనార్‌కు షాకింగ్ రిక్వెస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సాంకేతికత దుర్వినియోగం అవుతోందని, సెలబ్రిటీలను వేధింపులకు గురిచేసేలా కొందరు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడుతూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

News18
News18

ప్రముఖ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సాంకేతికత దుర్వినియోగం అవుతోందని, సెలబ్రిటీలను వేధింపులకు గురిచేసేలా కొందరు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు అనసూయ. సోషల్ మీడియాలో తనను అత్యంత అసభ్యకరమైన రీతిలో చూపిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సాయంతో సృష్టించిన నకిలీ (డీప్‌ఫేక్) ఫొటోలను కొందరు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అనసూయ తాజాగా హైదరాబాద్ సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్‌కు ఆన్‌లైన్ వేదికగా అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ఒక నిర్దిష్ట సామాజిక మాధ్యమ ఖాతా ద్వారా తన వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను కించపరిచేలా ఈ ఏఐ జనరేటెడ్ ఫొటోలను నిరంతరం పోస్ట్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన వీసీ సజ్జనార్.. ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ బ్రాంచ్ దృష్టికి తీసుకెళ్లాలని, అక్కడ పూర్తి వివరాలతో ఫిర్యాదు నమోదు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆమెకు సూచించారు.

సైబర్ నేరాలపై పెరిగిన ఆందోళన:

ఇటీవలి కాలంలో రష్మిక మందన్న, ఆలియా భట్ వంటి పలువురు అగ్ర కథానాయికలు సైతం ఇలాంటి ఏఐ డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల భద్రత, గౌరవానికి భంగం కలిగిస్తున్న ఇటువంటి డిజిటల్ నేరాలపై కఠిన చట్టాలు తీసుకురావాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.

ఇకపోతే తనపై జరుగుతున్న ట్రోలింగ్, నెగెటివిటీపై అనసూయ స్పందిస్తూ.. కెరీర్ ఆరంభం నుండి తనకు వివాదాలు, విమర్శలు కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. గతంలో తన వ్యక్తిగత అలవాట్లు, వస్త్రధారణపై వచ్చిన నెగెటివ్ కామెంట్లను ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నారో ఆమె గుర్తుచేశారు. “ప్రారంభంలో ఇవన్నీ నన్ను బాధించాయి, కానీ కాలక్రమేణా వీటిని ఎలా దాటుకురావాలో నేర్చుకున్నాను. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా, నా పని నేను చేసుకుంటూ జీవితంలో ముందడుగు వేస్తాను” అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు, ఆమె తీసుకున్న చట్టపరమైన నిర్ణయం నెట్టింట వైరల్‌గా మారాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports