Anupama Parameswaran: ‘నా సోషల్ మీడియా.. నా ఇష్టం’.. సంచలనం రేపుతున్న అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కాగా, తాజాగా తన కొత్త సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి.

News18
News18

తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కాగా, తాజాగా తన కొత్త సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. తన సోషల్ మీడియా పోస్టులపై వస్తున్న విమర్శలకు అనుపమ పరమేశ్వరన్ గట్టిగానే సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కళ్యాణం’ సినిమాలో నటిస్తుంది. తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, అనుపమ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న అనుపమకు విలేకరులు ఆమె వ్యక్తిగత జీవితంపై, సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై ప్రశ్నలు సంధించారు.

ఇటీవల ఆమె చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు పరోక్షంగా ఎవరినో ఉద్దేశించి చేసినవేనని, వాటి వెనుక ఏదైనా వ్యక్తిగత కారణం ఉందా అనే ప్రశ్నకు అనుపమా స్పష్టంగా స్పందించింది. తన సోషల్ మీడియా ఖాతాలో ఏం పోస్ట్ చేయాలనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, దానిపై ఇతరులు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. సోషల్ మీడియాలో తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని, ఎవరిపైనా కోపం లేదంటే ద్వేషంతో పోస్టులు పెట్టలేదని ఆమె స్పష్టం చేసింది.

ఒక మహిళగా తన జీవితంలో ఎదురైన అనుభవాలు, ఆలోచనలు, భావోద్వేగాలను మాత్రమే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నానని అనుపమ తెలిపింది. తన మనసులోని భావాలను నిజాయితీగా వ్యక్తపరచడంలో ఎలాంటి తప్పు లేదని, అందుకు తాను గర్వపడుతున్నానని చెప్పింది. తన పోస్టులను చూసి అనవసరంగా కథలు సృష్టించడం, ఎవరితోనో వాటిని ముడిపెట్టడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది.

అంతేకాదు.. తన వ్యక్తిగత జీవితం గురించి బయటివారికి పూర్తిగా తెలియదని.. అలాంటప్పుడు తన గురించి ఊహాగానాలు చేయడం ఎందుకని ఆమె ప్రశ్నించింది. సోషల్ మీడియా అనేది తన వ్యక్తిగత వేదిక అని, అందులో తనకు నచ్చిన విషయాలను పంచుకునే హక్కు తనకు ఉందని స్పష్టం చేసింది. ప్రతి పోస్టుకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై లేదని కూడా ఆమె తేల్చి చెప్పింది.

ఇటీవల అనుపమ పరమేశ్వరన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళ నటుడు ధ్రువ్ విక్రమ్‌తో ఆమె పేరు కలిపి పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ప్రచారాలపై అనుపమ ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్టులపై నేరుగా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు మాత్రం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘క్రేజీ కళ్యాణం’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వినోదాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు అనుపమా పరమేశ్వరన్ కూడా తెలుగు, తమిళ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports