Anushka Shetty: బాహుబలిలో దేవసేన రోల్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? చివరి క్షణంలో అనుష్క నక్కతోక తొక్కేసింది | | ACTPnews

Nayanthara


Nayanthara

బాహుబలి లాంటి పెద్ద చిత్రంలో భాగం కావడానికి నయనతార నిరాకరించడానికి ప్రధాన కారణం, ఆ సినిమా కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడమే. బాహుబలి ఫ్రాంచైజీ 2013 నుండి 2017 మధ్య పూర్తయింది. దర్శకుడు రాజమౌళి సినిమా షూటింగ్ కోసం రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఇవ్వమని అడిగినప్పుడు, నయనతార నో చెప్పిందట. ఆ రెండు సంవత్సరాలను ఒకే సినిమాకు కేటాయించడం కంటే, మరిన్ని ప్రాజెక్టులలో నటించాలన్నది ఆ సమయంలో నయనతార లక్ష్యం. బహుశా బాహుబలి సాధించబోయే ప్రపంచవ్యాప్త విజయం గురించి ఆ సమయంలో ఆమె ఏమాత్రం అంచనా వేయలేదు. కానీ నయనతార వద్దన్న ఆఫర్ ను అనుష్క స్వీకరించి, దేవసేన పాత్రను తన కెరీర్‌లోనే అత్యుత్తమ పాత్రగా మలచుకుంది. ఆ సినిమా పట్ల అనుష్క చూపిన అంకితభావానికి, ఆమెకు పాన్-ఇండియన్ సూపర్‌స్టార్ హోదా లభించి తగిన ప్రతిఫలాన్ని పొందింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports