సమ్రీన్ కౌర్ బాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రం ’83’ తో పాటు పంజాబీ మూవీ ‘సర్దార్ జీ 2’ లలో నటించారు. ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5లో వచ్చిన ‘నెయిల్ పాలిష్’ అనే వెబ్ సిరీస్‌లోనూ ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. కేవలం సినిమాలు, సిరీస్‌లే కాకుండా పాపులర్ మ్యూజిక్ వీడియోలలోనూ ఆమె మెరిసారు. ప్రముఖ గాయకులు గురు రంధావా, బాద్‌షా, జుబిన్ నౌటియాల్‌లతో కలిసి చేసిన ఆల్బమ్స్ ద్వారా ఈమె ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా ‘బావ్లా’, ‘తుజే భూల్నా తో చాహా’ వంటి పాటలు సమ్రీన్‌కు మంచి ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. నటనతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈమె, ఫ్యాషన్, ట్రావెలింగ్, కెరీర్ అప్‌డేట్‌లను క్రమం తప్పకుండా అభిమానులతో పంచుకుంటారు. (PC: Instagram/samreenkaur)














