Last Updated:
ఇటీవల విడుదలై విజువల్ వండర్‌గా ప్రశంసలు అందుకున్న మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ (Trikala) విజయంతో సినీ వర్గాల్లో ఆ సినిమా కెమెరా మెన్ పేరు హాట్ టాపిక్ అయింది.
సినిమా అనేది ప్రేక్షకులను ఒక సరికొత్త లోకంలోకి తీసుకువెళ్లే ఒక అద్భుతమైన దృశ్యకావ్యం. తెరపై కనిపించే ప్రతి ఫ్రేమ్‌కు, కథలోని ప్రతి ఎమోషన్‌కు ప్రాణం పోసేది సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతం టాలీవుడ్లో సరిగ్గా అలాంటి అరుదైన ప్రతిభతో, తన కెమెరా పనితనంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు యువ సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా (Pavan Chenna). ఇటీవల విడుదలై విజువల్ వండర్‌గా ప్రశంసలు అందుకున్న మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ (Trikala) విజయంతో ఆయన పేరు సినీ వర్గాల్లో మారుమోగుతోంది.
‘కథ’కే తొలి ప్రాధాన్యత
గ్లామరస్ బ్యూటీ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో, సనాతన ధర్మం మరియు దానిలోని నిగూఢ రహస్యాల నేపథ్యంగా దర్శకుడు మణి తెల్లగూటి ‘త్రికాల’ చిత్రాన్ని తెరకెక్కించారు. మే 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సైతం విశేషంగా ప్రేక్షకులను అలరిస్తోంది. రాధిక–శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్ ఎల్ఎల్పీ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా సాధించిన ఘన విజయంలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) పవన్ చెన్నా అందించిన విజువల్స్ కీలక పాత్ర పోషించాయి. ఆయన ఎప్పుడూ ‘స్టోరీ-ఫస్ట్’ (Story-First) అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు. ప్రేక్షకుడి దృష్టిని మళ్లించకుండా, కేవలం కథలోని భావోద్వేగాలను ఎలివేట్ చేసేందుకే ఆయన తన కెమెరా యాంగిల్స్, లైటింగ్ సెటప్‌ను ఉపయోగిస్తారని ఇండస్ట్రీలో టాక్.
హాలీవుడ్ స్థాయి కలర్ థియరీ, వీఎఫ్ఎక్స్..
సనాతన ధర్మానికి, చీకటి శక్తులకు మధ్య జరిగే భీకర పోరాటాన్ని తెరపై ఆవిష్కరించడంలో పవన్ చెన్నా అత్యద్భుతమైన కలర్ థియరీని వాడారు. డార్క్ ఇంక్-బ్లాక్ టోన్స్ (Ink-black tones), గోల్డెన్ లైటింగ్ బీమ్స్ కాంబినేషన్‌తో ఆయన సృష్టించిన విజువల్స్ హాలీవుడ్ ప్రమాణాలను తలపించేలా ఉన్నాయి.
ముఖ్యంగా మైథలాజికల్ చిత్రాలకు అత్యంత అవసరమైన హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ (VFX) గ్రాఫిక్స్‌కు, పవన్ పర్ఫెక్ట్ లైటింగ్ కంట్రోల్ తోడవడంతో వెండితెరపై ప్రతి ఫ్రేమ్ ఒక లార్జర్-దాన్-లైఫ్ కాన్వాస్‌లా అద్భుతంగా పండింది.
ప్రశంసలపై పవన్ చెన్నా స్పందన:
తన కెమెరా వర్క్‌కు దక్కుతున్న ప్రశంసలపై డీఓపీ పవన్ చెన్నా సంతోషం వ్యక్తం చేశారు. “కెమెరా అనేది కేవలం దృశ్యాలను రికార్డు చేసే ఒక యంత్రం కాదు, దర్శకుడి ఆలోచనలకు, ఊహలకు ప్రాణం పోసే ఒక బలమైన భాష. సనాతన ధర్మం, దైవత్వం వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఒక మైథలాజికల్ థ్రిల్లర్‌కు పనిచేయడం నాకు చాలా గొప్ప సవాల్‌గా అనిపించింది. డైరెక్టర్ మణి తెల్లగూటి విజన్‌ను తెరపై యథాతథంగా ఆవిష్కరించేందుకు ప్రతి ఫ్రేమ్పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాము. ప్రేక్షకులు అందిస్తున్న ఈ ఆదరణ ఒక సాంకేతిక నిపుణుడిగా నాపై మరింత బాధ్యతను పెంచింది” అని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య ప్రకటనలు, మ్యూజిక్ వీడియోల నుంచి ప్రారంభమైన పవన్ చెన్నా ప్రయాణం.. ఇప్పుడు ‘త్రికాల’ వంటి పౌరాణిక చిత్రాలతో కొత్త పుంతలు తొక్కుతోంది. భవిష్యత్తులో ఈ యువ టెక్నీషియన్ నుంచి మరిన్ని విజువల్ అద్భుతాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














