Last Updated:
Asia Cup 2026 Final: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల జట్టు ముంగిట నిలిచింది.
రికార్డు స్థాయిలో ఇప్పటికే ఏడుసార్లు ఆసియా కప్‌ను ముద్దాడిన టీమిండియా, ఇప్పుడు ఎనిమిదో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరగనున్న హైవోల్టేజ్ ఫైనల్ సమరంలో హర్మన్‌ప్రీత్ సేన హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టోర్నీ ఆరంభం నుంచి అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత్, అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించి కప్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఫైనల్ పోరు రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. సోనీ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.














