Last Updated:
తిరుమల శ్రీవారి డిసెంబర్ నెల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్లు, వసతి గదుల కోటాను టీటీడీ దశలవారీగా విడుదల చేయనుంది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాలను గమనించి టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకోవచ్చు.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, వివిధ రకాల దర్శన టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్లు, వసతి గదుల కోటాను సెప్టెంబర్ 19 నుంచి 24వ తేదీ వరకు దశలవారీగా ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ముందుగానే తేదీలు, సమయాలను గమనించి టికెట్ల కోసం నమోదు చేసుకోవాలని టీటీడీ సూచించింది.














