Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ ‘గోల్డెన్ ఫ్రైడే’.. ఒకే రోజు 6 స్వర్ణాలు.. 76 పతకాలతో ఐదో స్థానానికి జంప్! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టించారు. శుక్రవారం ఒక్కరోజే హాకీ, బాక్సింగ్, విలువిద్య, రెజ్లింగ్‌లలో ఏకంగా ఆరు స్వర్ణాలు కొల్లగొట్టి పతకాల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకారు.

News18
News18

జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 ముగింపు దశలో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. శుక్రవారం పోటీల్లో భారత క్రీడా బృందం ఏకంగా ఆరు బంగారు పతకాలను కొల్లగొట్టి పతకాల పట్టికలో అగ్ర ఐదు దేశాల సరసన నిలిచింది. దీంతో భారత్ ఖాతాలో మొత్తం 76 పతకాలు చేరాయి. ఇందులో 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలు ఉన్నాయి. నాలుగో స్థానంలో ఉన్న ఉజ్బెకిస్థాన్ కంటే భారత్‌కు ఎక్కువ పతకాలు ఉన్నప్పటికీ, బంగారు పతకాల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసంతో భారత్ ఐదో స్థానాన్ని పదిలం చేసుకుంది.

44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళల హాకీ జట్టు చైనాను 1-0తో ఓడించి స్వర్ణంతో పాటు నేరుగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ అర్హత సాధించింది. అంతకుముందు మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు 10 సార్లు ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను 5-3తో ఓడించి తొలిసారి సరికొత్త రికార్డు నమోదు చేసింది.

రింగ్‌లో బాక్సర్ల పంచ్.. మ్యాట్‌పై సుజీత్ పవర్

బాక్సింగ్ రింగ్‌లో భారత పంచ్ అదిరిపోయింది. తన 29వ పుట్టినరోజు జరుపుకుంటున్న లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), పర్వీన్ హుడా (65 కేజీలు), అంకుశ్ పంఘల్ (80 కేజీలు) ప్రత్యర్థులను చిత్తు చేసి మూడు స్వర్ణాలు అందించారు. ఆసియా క్రీడల బాక్సింగ్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.

రెజ్లింగ్ విభాగంలో 23 ఏళ్ల యువ రెజ్లర్ సుజీత్ కల్కల్ 65 కేజీల కేటగిరీలో 2-9తో వెనుకబడిన స్థితి నుంచి చివరి క్షణాల్లో వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి సంచలన రీతిలో స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

ఇతర విభాగాల్లో మిక్స్‌డ్, పురుషుల రికర్వ్ ఆర్చరీ జట్లు రజతాలు సాధించగా, సెయిలింగ్‌లో నేత్ర కుమనన్, సెపక్‌తక్రా పురుషుల జట్టు కాంస్యాలు గెలుచుకున్నారు. బాక్సింగ్‌లో ప్రియ, కపిల్, నరేందర్ కాంస్య పతకాలు సాధించారు. షూటింగ్, బ్యాడ్మింటన్ విభాగాల్లో ఎదురైన నిరాశను తుడిచిపెడుతూ భారత అథ్లెట్లు పతకాల పంట పండించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports