Ayodhya Ram Temple: అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు.. సీసీటీవీలో 100 సార్లకు పైగా దొంగతనం దృశ్యాలు రికార్డు! | | ACTPnews

News18


Last Updated:

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక సంచలన విషయాలు బయటపెట్టింది. లెక్కింపు గదిలో వంద సార్లకు పైగా నగదు చోరీ జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి ఎనిమిది మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

News18
News18

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రూపొందించిన 59 పేజీల కీలక దర్యాప్తు నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు గది నుంచి నిందితులు ఏకంగా వంద సార్లకు పైగా డబ్బులు దొంగిలించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ కేసులో అరెస్టయిన ఎనిమిది మంది నిందితులకు వ్యతిరేకంగా సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ చాట్స్, కాల్ డేటా రికార్డులు (CDRs), బ్యాంకు లావాదేవీల బలమైన ఆధారాలతో పోలీసులు పక్కా ఛార్జ్‌షీట్ సిద్ధం చేసి కోర్టుకు సమర్పించారు.

ఇందులో ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, డాక్టర్ అనిల్ మిశ్రా, సాక్షి గోపాల్ నగర్ కట్టే సహా పలువురి వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితులు పరస్పరం ఫోన్ల ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పథకం ప్రకారమే ఈ చోరీకి పాల్పడినట్లు డిజిటల్ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.

సీసీటీవీ ఫుటేజీలో నిందితుల చోరీ లీలలు

పోలీసుల నివేదిక ప్రకారం ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఏకంగా 85 సార్లు విరాళాల సొమ్మును దొంగిలిస్తూ సీసీటీవీ కెమెరాలకు చిక్కాడు. కరుణేష్ పాండే రెండుసార్లు డబ్బు తీయగా, సహ నిందితులకు 68 సార్లు సహకరించాడు. మనీష్ యాదవ్ 16 సార్లు నగదు చోరీ చేసి, మరో 19 సార్లు ఇతరులకు సాయం చేశాడు. లవకుశ్ మిశ్రా ఒకసారి డబ్బు తీసి, 52 సార్లు సహకరించగా.. అనుకల్ప్ మిశ్రా 56 సార్లు చోరీకి సహకరించాడు. రమాశంకర్ మిశ్రా ఒకసారి నగదు తీస్తూ కెమెరాకు చిక్కాడు. వీరితో పాటు ట్రస్ట్ మాజీ డ్రైవర్ రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ, లెక్కింపు ఇన్‌ఛార్జ్ సుభాష్ శ్రీవాస్తవపైనా అభియోగాలు నమోదు చేశారు.

బాత్రూమ్‌లో నోట్ల కట్టలు.. భారీగా నగదు స్వాధీనం

జూన్ 4న జరిగిన ఘటనలో బాత్రూమ్ నుంచి నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని చంపత్ రాయ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. నిందితుల సమాచారంతో పోలీసులు దాదాపు రూ.79.85 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, ఆభరణాలు రికవరీ చేశారు. అవినాష్ శుక్లా నుంచి రూ.20.39 లక్షల నగదు, 1,121 అమెరికన్ డాలర్లు, 150 గ్రాములకు పైగా వెండి, 8 గ్రాముల బంగారం, ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. కరుణేష్ పాండే వద్ద రూ.18.07 లక్షలు, అనుకల్ప్ మిశ్రా వద్ద రూ.16.82 లక్షలు, లవకుశ్ మిశ్రా వద్ద రూ.14.25 లక్షలు, రమాశంకర్ మిశ్రా వద్ద రూ.7.32 లక్షలతో పాటు వెండి నాణెం, కాలి మెట్టెలు, మనీష్ యాదవ్ వద్ద రూ.2 లక్షలు, టిన్నూ యాదవ్ వద్ద రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు.

చోరీ సొమ్ముతో ఆస్తుల కొనుగోలు

భక్తుల హుండీ సొమ్మును కాజేసిన నిందితులు ఆ డబ్బుతో విలాసవంతమైన కార్లు, భూములు, ఇళ్లు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనుకల్ప్ మిశ్రా తండ్రి పేరిట కొన్న ఇంటికి ఈ చోరీ డబ్బునే వాడినట్లు గుర్తించారు. మరో నిందితుడు లవకుశ్ మిశ్రా ఏకంగా రూ.43.43 లక్షలు వెచ్చించి భూములు, ఇల్లు కొనుగోలు చేశాడు. అంతేకాకుండా నిందితుల బ్యాంకు ఖాతాల్లో లక్షలాది రూపాయల నగదు జమ అయినట్లు అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports