Bandla Ganesh: నువ్వయ్యా నిజమైన భక్తిడివంటే..! పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా బండ్లన్న సూపరో సూపర్.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పవన్ కళ్యాణ్ వీరాభిమాని, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ రంగంలోకి దిగి.. జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ అనే అభిమానికి తాను కూడా సాయం చేస్తానని ప్రకటించారు. పవన్ రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటిస్తే బండ్లన్న అంతకు మించి చేశారు.

News18
News18

ప్రాణాంతక జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన వీరాభిమాని నిరంజన్‌ (17)ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం హనుమకొండలో పరామర్శించారు. హనుమాన్ నగర్‌లోని బాలుడి ఇంటికి వెళ్లిన ఆయన, నిరంజన్‌తో ముచ్చటించి, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. అభిమానితో, అతని ఫ్యామిలీతో మాట్లాడి వారితో కొంత సమయం గడిపి, వారితో ఫొటోలు దిగారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ రంగంలోకి దిగి అదే అభిమానికి తాను కూడా సాయం చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. వరంగల్-హనుమకొండకు చెందిన 17 ఏళ్ల బాలుడు పొనుగోటి నిరంజన్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుండటం చాలా బాధాకరం. చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలనే నిరంజన్ కోరిక నేడు నెరవేరబోతుండటం నా హృదయాన్ని కదిలించింది.

మీడియా మిత్రుల సహకారంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరగా, ఆయన స్వయంగా నిరంజన్ కలవడానికి హనుమకొండకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా, ఆయన స్ఫూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కు, అతని కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5,00,000 (ఐదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను అని తెలిపారు. ఇది చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, టాలీవుడ్ లోకం బండ్ల గణేష్ ని అభినందిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *