Barabar Premistha: అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్న చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’.. డిజిటల్ వేదికపై సూపర్ రెస్పాన్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ హిట్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది.

News18
News18

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ నటించిన రీసెంట్‌ హిట్ సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా నటించారు. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) విలన్‌గా మెప్పించారు. ‘బారాబర్ ప్రేమిస్తా’ మూవీని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మించారు. ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

థియేటర్లో మంచి హిట్ దక్కించుకున్న తరువాత రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ‘బరాబర్ ప్రేమిస్తా’ సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఓటీటీ వేదికపై చంద్రహాస్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కి మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీకి కథని ఎంఏ తిరుపతి, మాటలు రమేష్ రాయ్ అందించారు. వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, ఆర్ఆర్ ద్రువన్ సంగీత దర్శకుడిగా పని చేశారు, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports