Big Bash League: చరిత్ర సృష్టించనున్న బిగ్ బాష్ లీగ్.. తొలిసారి భారత్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ పండగ! | క్రీడా వార్తలు | ACTPnews

మోదీ, బిగ్ బాష్ లీగ్ విన్నర్


Last Updated:

Big Bash League: ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నమెంట్ ‘బిగ్ బాష్ లీగ్’ (Big Bash League) సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది.

మోదీ, బిగ్ బాష్ లీగ్ విన్నర్
మోదీ, బిగ్ బాష్ లీగ్ విన్నర్

ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానున్న బిగ్ బాష్ లీగ్ (2026-27 సీజన్) ప్రారంభ మ్యాచ్‌కు భారతదేశంలోని చెన్నై నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. తద్వారా భారత్‌లో ఒక మ్యాచ్‌ను నిర్వహించబోతున్న తొలి విదేశీ క్రికెట్ లీగ్‌గా బిగ్ బాష్ లీగ్ రికార్డు నెలకొల్పనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో శుక్రవారం ఈ చరిత్రాత్మక ప్రకటనను అధికారికంగా వెల్లడించారు. డిసెంబర్ 12న చెన్నైలోని ఐకానిక్ ‘ఎమ్ఏ చిదంబరం స్టేడియం’ (చేపాక్) లో జరిగే ఈ ఓపెనింగ్ మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్లు తలపడనున్నాయి.

‘జీ డే నమస్తే ఉత్సవాల్లో భాగం’

డిసెంబర్ నెలలో భారతదేశం అంతటా జరగనున్న వారం రోజుల పాటు సాగే ఆస్ట్రేలియా సాంస్కృతిక, వ్యాపార, క్రీడా ఉత్సవం ‘జీ డే నమస్తే’లో ఈ బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య క్రీడలు, సాంకేతికత, పెట్టుబడులను పెంపొందించేందుకు కుదిరిన ‘సహకార రోడ్‌మ్యాప్’ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

క్రికెట్ ఆస్ట్రేలియా హర్షం

“భారతదేశం అంతటా, ముఖ్యంగా చెన్నైలో అద్భుతమైన క్రికెట్ ప్రేమికులు ఉన్నారు. చేపాక్ స్టేడియంలో మ్యాచ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని మేము ఆశిస్తున్నాము” అని బిగ్ బాష్ లీగ్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డోబ్సన్ సంతోషం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కి ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఈ మ్యాచ్‌లో కూడా స్టాండ్స్ అంతా పసుపు రంగు (Yellow Jersey) జెండాలతో నిండిపోయే అవకాశం ఉందని ఆయన చమత్కరించారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed