Kotha Cinema: లోకల్ టాలెంట్‌తో పక్కా లోకల్ మూవీ కొత్త సినిమా.. మేము కూడా సినిమా తీసినామురో సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా “కొత్త సినిమా”. ఈ సినిమాతో 100 మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం.

News18
News18

కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా “కొత్త సినిమా”. ఈ సినిమాతో 100 మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం చరణ్ అర్జున్ లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ‘మేము కూడా సినిమా తీసినామురో..’ పాటను ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు సాగర్ అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటుడు సురేశ్ మాట్లాడుతూ – మాది గోదావరిఖని దగ్గర మార్కండేయ కాలనీ. నేనొక కిరణా షాప్ నడుపుకుంటూ ఉంటాను. నాకు సినిమాల మీద ఇష్టం ఉండేది. అజర్ గారు ఆడిషన్స్ కోసం మా గోదావరిఖని వచ్చినప్పుడు నేనూ వెళ్లాను. వెనక నిలబడే చిన్న పాత్ర దక్కితే చాలు అనుకున్నాను. కానీ ఈ సినిమాలో నాకు లీడ్ రోల్ ఇచ్చారు. అజర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా కోసం నటనలో శిక్షణ ఇప్పించారు. కొత్త వాళ్లం అందరం చేసిన మా సినిమాను మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.

ప్రొడ్యూసర్ మహమ్మద్ వాసిమ్ అక్రమ్ మాట్లాడుతూ – మా కొత్త సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. టైటిల్ కు తగినట్లే మా సినిమా నిజంగా కొత్తగా ఉంటుంది. మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుతున్నా. అన్నారు. ప్రొడ్యూసర్ యడండ్ల సతీష్ యాదవ్ మాట్లాడుతూ – మా కొత్త సినిమా సాంగ్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా సినిమాను ఒక సరికొత్త కంటెంట్ తో లోకల్ టాలెంట్ అజర్ అందరికీ నచ్చేలా రూపొందించాడు. త్వరలోనే మా సినిమాను రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

నటుడు రాకేష్ మాట్లాడుతూ – మా స్వస్థలం రామగుండం. నేను సింగరేణి ఎంప్లాయ్ ని. సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. అయితే మధ్య తరగతి కుటుంబం కావడం వల్ల హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వీలు దొరకలేదు. అజర్ అన్న మా ఊర్లో ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. మెయిన్ లీడ్ కు నన్ను సెలెక్ట్ చేశారు. మా ఊర్లో ఉంటూ మా అమ్మ చేతి భోజనం తింటూ సినిమా అవకాశం దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. కొత్త వాళ్లం చేసిన మా సినిమాను మీరంతా ఎంకరేజ్ చేయాలి. అన్నారు.

మేము కూడా సినిమా తీసినామురో పాట కంపోజర్, లిరిక్ రైటర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ – నేను మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉన్నా. అజర్ వచ్చి ఈ సినిమాకు ప్రమోషనల్ సాంగ్ చేయమని అడిగాడు. నా గురించి, నా సంగీతం అజర్ వాళ్ల నాన్నకు నచ్చి నా పేరు సజెస్ట్ చేశాడట. గోదావరిఖని అనే ఊరి దాకా నా మ్యూజిక్ వెళ్లింది అనే సంతోషంతో ఈ పాట చేశాను. హైదరాబాద్ వచ్చి తమ సినిమా కలను నెరవేర్చుకోలేని ఎంతోమంది ఔత్సాహికుల ఆవేదన ఈ పాటలో ఉంటుంది. లోకల్ టాలెంట్ తో లోకల్ లో సినిమా చేసిన అజర్ నిజంగా హీరో. ఈ టీమ్ ను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.

డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ – మేము కింద స్థాయి నుంచి వచ్చామని చాలా మంది చెబుతుంటారు. మేము ఇంకా కింద స్థాయి నుంచి భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిలోంచి వచ్చాం. చీకటిలో వెలికితీసే బొగ్గు నుంచి వెలుగు పంచే ప్రాంతం రామగుండం నుంచి వచ్చిన వాళ్లం. ఎందరో గొప్ప తెలుగు దర్శకులు సినిమాను మన దగ్గరకు చేర్చారు, మనల్ని ఇన్స్ పైర్ చేశారు. నేను ఈ సినిమాను మరింత దగ్గరగా తీసుకెళ్లాలని అనుకున్నా. పట్నంలోనే ఉంటదా కళామతల్లి, జర వెతికి చూడు ఉంటుంది గల్లీ గల్లీ అని ఈ పాటలో చెప్పినట్లు సినిమాను లోకల్ లో తీసి వందమంది కొత్త వాళ్లను పరిచయం చేస్తున్నా. మన ఊరిలోనే ఉంటూ మన ఊరివాళ్లతో సినిమా తీయొచ్చు అని ప్రూవ్ చేశా. ఇంతమంది కొత్త వాళ్లను మీ ముందుకు తీసుకొచ్చా. నాకు సపోర్ట్ చేస్తున్న శ్రీధర్ గారికి, మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, చరణ్ అర్జున్ గారికి, సాగర్ గారికి థ్యాంక్స్. అన్నారు.

నటుడు R K సాగర్ మాట్లాడుతూ – అజర్ ఈ సినిమా గురించి మూడేళ్ల క్రితం నుంచే చెబుతున్నాడు. నేను మాట్లాడినప్పుడుల్లా ఈ మూవీ గురించి ఎలా జరుగుతుందని అడిగేవాడిని. ఈ సినిమా కోసం అజర్ చాలా కష్టపడ్డాడు. వందమంది కొత్త వాళ్లను తెరకు పరిచయం చేయడం మామూలు విషయం కాదు. హుస్సేన్ గారు ఈ సినిమా కోసం తను సింగరేణి ఎంప్లాయిగా పడిన 40 ఏళ్ల కష్టాన్ని ఫణంగా పెట్టారు. ఆయన పీఎఫ్ డబ్బులను ఈ మూవీ నిర్మాణానికి ఉపయోగించారు. ఈ సినిమాకు సపోర్ట్ గా నిలుస్తున్న మధుర శ్రీధర్ గారికి, చరణ్ కు, సాయిలు గారికి థ్యాంక్స్. అన్నారు.

ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – కొత్త సినిమా నేను చూశాను. చాలా బాగుంది. ఈ సినిమాను నిజంగానే కొత్తగా తీశారు. ఫిలిం మేకింగ్ లో అజర్ అన్ని రూల్స్ బ్రేక్ చేశాడు. ఆర్జీవీ అన్నట్లు మేడిన్ కరీంనగర్ కాదు మేడిన్ గోదావరిఖని అని ప్రూవ్ చేశాడు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఈ మూవీ రిలీజ్ కు, అలాగే ఓటీటీ రిలీజ్ కు కూడా అండగా నిలబడాలని అనుకుంటున్నాను. అన్నారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ – అజర్ ఒకరోజు నన్ను కలిసి సినిమా నిర్మాణం చేస్తున్నట్లు చెప్పాడు. మా ప్రాంతం నుంచి సినిమా నిర్మించి నష్టపోయినవారున్నారు. అందుకే ప్రొడక్షన్ వద్దు అని చెప్పా. కొడుకు అజర్ కలను తీర్చడం కోసం తండ్రి హుస్సేన్, ఇతర కుటుంబ సభ్యులు గొప్ప త్యాగం చేశారు. మా ఏరియాలో చాలా మంది నటులున్నారు. మన దర్శకులు నిర్మాతలు వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం తరుపున కూడా స్థానిక ఫిలింమేకర్స్ కు అందాల్సిన సాయాన్ని, సహకారాన్ని అందిస్తాం. ఈ కొత్త వాళ్లు అందరినీ, కొత్త సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed