Viral Video: 80 ఏళ్ల వయసులోనూ రోజుకు 16 గంటల కారు డ్రైవింగ్.. ఈయన లైఫ్ స్టోరీ చూసి నెటిజన్లు షాక్ | ట్రెండింగ్ | ACTPnews

Viral Video


Last Updated:

Viral Video: 80 సంవత్సరాలు దాటిన వయసులో ఓ వృద్ధుడు రోజంతా రెంట్ టాక్సీ నడుపుతున్నాడు. రోజుకు 16 గంటల పాటు రోడ్లపై కారు నడుపుతూ వచ్చిన డబ్బును ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. ఆయన లైఫ్ చాలా మందికి స్పూర్తినిస్తుంది.

Viral Video
Viral Video

Taxi Driver: దాదాపు 80 ఏళ్ల వయసులో తన సంకల్పానికి అనుగుణంగా శరీరం సహకరించకపోయినా, రవీంద్రనాథ్ సర్కార్ ప్రతి ఉదయం తన పసుపు రంగు టాక్సీ స్టీరింగ్ వీల్‌ను పట్టుకుని పనికి బయలుదేరుతారు. ఆయన ఇది ఏదో గొప్ప ఆశయం కోసం చేయడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తన 67 ఏళ్ల భార్యను పోషించుకోవడం కోసం సత్తువ లేకపోయినా ఓపికను కూడగట్టుకొని జీవితచక్రాన్ని ముందుకు నడుపుతున్నారు. కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఆయన రెంట్ టాక్సీని నడుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓల్డేజ్ పెన్షన్ తీసుకొని విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా సిన్సియర్ సీనియర్ సిటిజన్ అనిపించుకుంటున్నారు.

చివరి మజిలీ కూడా కష్టంగానే..

కొందరి జీవితాలు ఎంతో మందికి స్పూర్తిని ఇస్తాయి. వాళ్లు లైఫ్‌ని ఛాలెంజ్‌గా తీసుకొని కుటుంబాన్ని పోషించే తీరు పది మందికి ఇన్స్‌పిరేషన్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో చైతాలి బోస్ అనే వినియోగదారు పంచుకున్న ఈ వీడియో వేలాది మంది హృదయాలను తాకింది. కోల్‌కతాలోని డం డం ప్రాంతంలో రైల్వే పట్టాల దగ్గర నివసిస్తున్న ఈ వృద్ధ దంపతుల పట్టుదలను ప్రజలు ప్రశంసిస్తూ, వారికి మద్దతు తెలపాలని కోరుతున్నారు. దాదాపు 52 ఏళ్లుగా టాక్సీ నడుపుతున్న 80 సంవత్సరాల రవీంద్రనాథ్ సర్కార్ ఉదయం 6 గంటలకే పని మొదలుపెట్టి, జీవనోపాధి కోసం కోల్‌కతా వీధుల్లో రోజుకు 16 గంటల వరకు గడుపుతారని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.

మందులు కొనడానికి కూడా డబ్బుల్లేవ్..

వయసు పైబడటం , ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ఆయన ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా యెల్లో టాక్సీని అద్దెకు తీసుకొని నడుపుతూనే ఉన్నారు. కొన్నిసార్లు రాత్రి 11 గంటల వరకు కూడా ఆయన డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. రోజంతా ఒక్క ప్రయాణికుడు దొరకకపోయినా లేదా ఒక్క రూపాయి సంపాదించకపోయినా టాక్సీ యజమానికి అద్దె చెల్లించాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. విధి ఎంత విచిత్రమైనదో తెలుసా.. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వృద్ద జంటకు సంతానం కూడా లేకపోవడం బాధాకరం. తమను చూసుకోవడానికి పిల్లలు ఎవరూ లేని ఈ దంపతులకు రవీంధ్ర సర్కార్ సంపాదనతోనే కాలం వెళ్లదీయాలి. కానీ ఆ సంపాదన ఆ వృద్ద దంపతులకు మందులు కొనడానికి కూడా సరిపోవడం లేదు.

బతుకు జట్కా బండి..

ఆయన సొంత ఆరోగ్య సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఆయన కథ మరింత విశేషమైనదిగా అనిపిస్తుంది. సర్కార్ దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడుతుండగా సర్కార్ భార్యకు ఒకరకమైన గుండె జబ్బు ఉంది. బోస్ వెల్లడించిన ప్రకారం వారు ఇంతగా బాధపడుతున్నప్పటికీ ఆ 80 ఏళ్ల వృద్ధుడు తన ప్రయాణికులను, డబ్బుల కోసం డిమాండ్ చేయకుండా మీకు తోచినంత ఇవ్వమని కోరుతూ ఉంటాడు.

తూచిన సాయం చేయండి..

ఆ దంపతుల జీవన పరిస్థితులు కూడా అంతే కష్టంగా ఉన్నాయి. వారు ఒక సాధారణ రేకుల ఇంట్లో నివసిస్తున్నారు, వర్షాకాలంలో దాని పైకప్పు కారుతుంది. వర్షపు నీరు ఇంట్లోకి చేరుతుంది. మరమ్మతులు చేయించడం వారి స్థోమతకు మించి ఉంటుంది. క్లిప్ చివరిలో తమకు తోచిన విధంగా సహాయం చేయడానికి ముందుకు రావాలని బోస్ ప్రజలను కోరారు.

.

నెటిజన్లకు రిక్వెస్ట్..

రవీంద్రనాథ్ సర్కార్ కథ ఆన్‌లైన్‌లో ప్రజల మనసులను తీవ్రంగా కదిలించింది. గౌరవంగా పనిచేస్తూ తమ జీవితాలను గడిపిన వారు, తమ చివరి రోజులను బతుకుదెరువు కోసం పోరాడుతూ గడపకూడదు అలాంటి వాళ్లకు మనకు సహాయం చేసే శక్తి ఉంటే అది చిన్న సహాయమైనా సరే, మనం చేయాలి. దయ అనేది దానం కాదు ఒకరిపట్ల ఒకరికి మనం చేయాల్సిన కర్తవ్యం అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

ఒక్కొక్కరు ఒక్కోలా..

చాలా మంది వృద్దాప్యం వస్తే యాచించుకుంటారు. కాని రవీంద్రనాథ్ మాత్రం కష్టపడి బ్రతుకుతున్నాడని మరొకరు పోస్ట్ పెట్టారు. అన్నపూర్ణ పథకానికి కేటాయించే డబ్బును తగ్గించి, ఆ డబ్బును వృద్ధాప్య పింఛనుగా ఇవ్వాలని మరో నెటిజన్ సలహా ఇచ్చారు. సమర్థులైన మహిళలు తమ సొంత ప్రయత్నాలతో కొంత సంపాదించుకోగలరు. కానీ ఈ వృద్ధులకు పనిచేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది, వారికి ఎక్కువ డబ్బు అవసరం అంటున్నారు.

ఇలాంటివి తట్టుకోవడం కష్టమే..

80 ఏళ్ల వయసులో కూడా ఒక వ్యక్తి ఇంత కష్టపడి పనిచేయడం చూస్తుంటే చాలా బాధగా ఉంది…. ఆ వ్యక్తికి సుఖవంతమైన జీవితం లభించాలని దేవుడిని ఆశీర్వదించాలి. ఇది చూశాక నాకు అర్థమవుతోంది మనం ఎంత అదృష్టవంతులమో అయినా కూడా మనమందరం చిన్న విషయాలకే ఏడుస్తామని ఎమోషనల్ కామెంట్ పెట్టాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed