Shobhan Babu wife death: శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత.. నేడు అంత్యక్రియలు.. శోకసంద్రంలో సినీ లోకం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

సతీమణితో శోభన్ బాబు (File Image credit - youtube - newsmantra)


Last Updated:

Shobhan Babu wife death: శోభన్ బాబు సినీ రంగంలో అగ్ర హీరోగా అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ, శాంతకుమారి ఎప్పుడూ ప్రచారానికి దూరంగా, నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఆయనకు కొండంత అండగా నిలిచారని సన్నిహితులు చెబుతారు.

సతీమణితో శోభన్ బాబు (File Image credit - youtube - newsmantra)
సతీమణితో శోభన్ బాబు (File Image credit – youtube – newsmantra)

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దివంగత అగ్ర నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను నాలుగు రోజుల కిందట చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను గురువారం పరామర్శించడానికి వచ్చిన ఒక ఆప్తమిత్రురాలితో ఆప్యాయంగా మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ వచ్చి, మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

శోభన్ బాబు, శాంతకుమారిల వివాహం 1958 మే 15న జరిగింది. దశాబ్దాల పాటు అత్యంత ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని గడిపిన ఈ దంపతులకు మొత్తం నలుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమార్తెలు మృదుల, ప్రశాంతి, నివేదిత కాగా.. ఒక కుమారుడు కరుణ శేషు ఉన్నారు. శోభన్ బాబు సినీ రంగంలో అగ్ర హీరోగా అత్యున్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ, శాంతకుమారి ఎప్పుడూ ప్రచారానికి దూరంగా, నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఆయనకు కొండంత అండగా నిలిచారని సన్నిహితులు చెబుతారు.

ఇవి కూడా చదవండి: A Monsoon Surprise: భారీ వర్షానికి నేలపై కూలిన చెట్టు.. రూ.28 లక్షలు పొందిన బాధితుడు

2008 సంవత్సరంలో శోభన్ బాబు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. అప్పటి నుంచి శాంతకుమారి తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. భర్త మరణం తర్వాత ఆమె పూర్తిగా ప్రజా జీవితానికి దూరంగా ప్రశాంతంగా కాలం గడిపారు. చెన్నైలోని వారి నివాసానికి శాంతకుమారి పార్థివ దేహాన్ని తరలించగా, నేడు (శుక్రవారం) అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: అక్కడ బావి తుపాను టెన్షన్.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్షాలు

తెలుగు సినీ చరిత్రలో శోభన్ బాబు నటనకే కాకుండా, ఆయన క్రమశిక్షణకు, పక్కా ప్రణాళికలకు ఎంతో పేరుంది. ఆయన సాధించిన ఆ విజయాల వెనుక శాంతకుమారి పాత్ర ఎంతో కీలకమనీ, కుటుంబ బాధ్యతలను ఆమె ఎంతో శ్రద్ధగా చూసుకున్నారని సినీ విశ్లేషకులు గుర్తుచేసుకుంటున్నారు. ఇటీవల రెండు నెలల కిందటే శాంతకుమారి ఒక మీడియా ఇంటర్వ్యూలో కనిపించారనీ, అప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఆమె ఇంతలోనే మరణించడం తీవ్రంగా కలచివేసిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతకుమారి మరణవార్త తెలుసుకున్న వెంటనే టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed