Last Updated:
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్షణం రానేవచ్చింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 10 లాంచింగ్ డేట్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
బుల్లితెర బిగెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ (Bigg Boss Telugu) సరికొత్త సీజన్‌తో మళ్లీ వచ్చేస్తోంది. పది సీజన్ల మైలురాయిని చేరుకున్న ఈ షో, ఈసారి గత రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వరుసగా తనదైన శైలిలో హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 10’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ రియాలిటీ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.














