Last Updated:
Hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త చరిత్రను లిఖించింది. నగరం నడిబొడ్డున ఉన్న ఐటీ కారిడార్ రాయదుర్గం పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి.
తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (TGIIC) శుక్రవారం నిర్వహించిన ప్రతిష్ఠాత్మక భూముల ఈ-వేలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని సరికొత్త ఆల్టైమ్ రికార్డు నమోదైంది. రాయదుర్గంలోని 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్ పీ2 (Plot P2) స్థలాన్ని వేలం వేయగా.. రికార్డు స్థాయిలో ఎకరం ధర రూ.269 కోట్లు పలికింది. ఈ ఒక్క ప్లాట్ వేలం ద్వారానే ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.1,447.22 కోట్ల భారీ రాబడి సమకూరింది. దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ఒకటిగా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి ఘనంగా చాటుకుంది.














