Last Updated:
Murder: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతిని అత్యంత దారుణంగా హత్య చేసి భారతదేశానికి పారిపోయి వచ్చిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఎనిమిది నెలలుగా పరారీలో ఉన్న నిందితుడు అర్జున్‌శర్మ (27)ను తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన సంచలన వివరాలను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు. హైదరాబాద్ లాలాగూడకు చెందిన నిఖిత (27) ఉన్నత చదువుల (ఎంఎస్) నిమిత్తం 2022లో అమెరికా వెళ్లింది. అక్కడ చెన్నైకి చెందిన అర్జున్‌శర్మతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఇతర స్నేహితులతో కలిసి మేరీల్యాండ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో కొన్నాళ్ళు నివసించారు. చదువు పూర్తయిన తర్వాత నిఖితకు డేటా అనలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే అర్జున్‌శర్మ ఉద్యోగం కోల్పోవడంతో, అతడు తన తల్లి రచనాశర్మతో కలిసి నిఖిత వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదును అప్పుగా తీసుకున్నాడు.














