Brahmamudi Serial Today june 14th Review: ఇందుని కాపాడిన పొదరిల్లు నారాయణ… రాజు అద్దె మొగుడని తెలుసుకున్న రేఖ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Brahmamudi Serial Today june 14th Weekly Review: స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో ఈ వారంజూన్ 8 వ తేదీ నుంచి జూన్ 13 వరకు జరిగిన కథ హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

News18
News18

Brahmamudi Serial Weekly Update: ‘స్టార్ మా’లో ప్రసారమవుతున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ఈ వారం ఎపిసోడ్స్ అత్యంత ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో సాగాయి. ఇందు కిడ్నాప్ డ్రామా నుండి మొదలై కంపెనీ కొత్త సీఈఓ ఎంపిక వరకు కథలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఐశ్వర్య కుట్రలను తిప్పికొట్టి ఇందు సీఈఓ చైర్‌లో కూర్చోవడం, మరోవైపు రేఖ వేస్తున్న కొత్త ప్లాన్స్‌ని రాజు తనదైన శైలిలో అడ్డుకోవడం ఈ వారం హైలైట్‌గా నిలిచాయి. ఆ ఇంట్రెస్టింగ్ కథాంశం ఈ వారం రోజువారీ ఎపిసోడ్లలో ఎలా సాగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జూన్ 8వ ఎపిసోడ్ లో ఇందుని కిడ్నాప్ చేసిన ఐశ్వర్య నిన్ను కాపాడుటానికి ఎవరు రారు నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు అంటుంది. ఆ మాటలు విన్న నారాయణ ఈ బండిని రిపేర్ చేయాలి అనుకుంటాడు. మరోవైపు బోర్డు మీటింగ్లో ఇద్దరు బోర్డు మెంబర్స్ రాజుకి ఇద్దరు బోర్డు మెంబర్స్ రేఖా కి సపోర్ట్ చేస్తారు ఇక మిగిలిన వ్యక్తి పరంధామయ్య తను ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కావడం లేదు కాస్త టైం కావాలి అంటాడు. మరోవైపు నారాయణ ఇందుని కాపాడే ప్రయత్నంలో రౌడీలతో ఫైట్ చేస్తాడు.

జూన్ 9 వ ఎపిసోడ్ లో రౌడీలతో ఫైట్ చేసి ఇందుని విడిపిస్తాడు నారాయణ. నేను అర్జెంటుగా ఆఫీస్ కి వెళ్ళాలి అని ఇందు అడగటంతో అక్కడే ఉన్న బండి తీసుకొని జట్ స్పీడ్లో ఆఫీస్ కి తీసుకెళ్తాడు నారాయణ. మరోవైపు పరంధామయ్య తన నిర్ణయాన్ని చెప్పేలోపు ఇందు అక్కడికి రావడంతో తన ఓటు ఇందు కి వేస్తాడు. మిగిలిన వాళ్లు కూడా ఇందుకే సపోర్ట్ చేయడంతో ఇందు సీఈవో అవుతుంది. సీన్ కట్ చేస్తే కారులో వెళుతూ నువ్వు సీఈవో అవ్వాలని చాలా ప్రయత్నించావు కదా పరంధామయ్య గారు చెప్పారు అంటుంది ఇందు. రేఖ ఎక్కడ సీఈఓ అయిపోతుందో అని ఆపటానికి అలా చేశాను నువ్వు నన్ను అవమానిస్తే ఇప్పుడే అద్దె మొగుడు పదవి నుంచి దిగిపోతాను అంటాడు రాజు. కారు ఆపి దిగి వెళ్ళిపో అంటుంది ఇందు. అయినా కూడా కారు ఆపకుండా వెళ్తున్న రాజుతో నీకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం నాకు అద్దె మొగుడుగా నటించాల్సిందే అంటుంది ఇందు.

జూన్ 10 వ ఎపిసోడ్ లో నందు వెంకీని తెలిసిన ఒక క్లౌడ్ కిచెన్ లో డెలివరీ బాయ్ గా జాయిన్ చేస్తుంది. పగలంతా వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ టైం కోచింగ్ కి వెళ్ళు అని వెంకీ తో చెప్తుంది నందు. మరోవైపు ఇందు సీఈఓ అయినందుకు ఆనందపడతారు సుమిత్ర దంపతులు. ఇందు సీఈఓ అయినందుకు తెగ బాధ పడిపోతుంది ఐశ్వర్య. రేఖ ఇందుతో మాట్లాడుతూ నీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తాను దానిమీద సైన్ చేయి అంటుంది. మీరు ఏం చేయమంటే అదే చేస్తాను ఎక్కడ వేలిముద్ర వేయమంటే అక్కడే వేస్తాను అంటూ అమాయకురాల్ల నటిస్తుంది ఇందు.

జూన్ 11వ ఎపిసోడ్ లో ఇందుకే నేను హెల్ప్ చేశానని మీరందరూ అనుకుంటున్నారు, ఆ రేఖ హిందు నుంచి భ్రమలో ఉంది కానీ ఇందు నే ఆ రేఖ చేత తల్లి సీఈవో అయ్యేలా చేసింది, నన్ను సీఈఓ చేయాలని అనుకోలేదు తను సీఈవో అవ్వటం కోసం నన్ను ఒక వెపన్లా వాడుకుంది అంటూ నిజాన్ని చెప్పేస్తాడు రాజు. సీఈవో చైర్ లో కూర్చుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి అని మనవరాలికి ధైర్యం చెప్తాడు సుభాష్. తరువాత తనని కిడ్నాప్ చేయించినందుకు ఐశ్వర్య చెంప పగలగొడుతుంది ఇందు. నీ పది లక్షల అప్పు నేను తీరుస్తాను అన్నాను కానీ ఇప్పుడు తీర్చను నీ అప్పు నువ్వే తీర్చుకో అంటుంది ఇందు.

జూన్ 12వ ఎపిసోడ్ లో నువ్వు బాధలో ఉన్నావని తెలిసి మందు బాటిల్ తీసుకువచ్చాను మగాళ్ళకి ఆనందం వచ్చిన కష్టం వచ్చినా అన్నిటికి ఒకటే మందు అది ఈ మందు అంటాడు శేషు. రాజు శేషు ఇద్దరూ కలిసి మందు కొడతారు. మరోవైపు డాక్యుమెంట్స్ మీద వేలిముద్ర వెయ్యమంటుంది రేఖ. అది చదివిన ఇందు దీని మీద వేలిముద్ర వేస్తే కంపెనీకి మొత్తం వస్తుంది ఎలా అంటూ కంగారు పడిపోతుంది. ఇందుకి చదవడం రాదు కదా ఎందుకు అలా కంగారు పడిపోతుంది అని నా డౌట్ అంటాడు శేషు. అదే సమయంలో రాజు తాగేసి ఇంట్లోకి వచ్చి నేను లేకుండా నా భార్య చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించాలనుకుంటున్నారా డాక్యుమెంట్స్ నేను చదువుతాను అంటూ డాక్యుమెంట్స్ చదువుతాడు. ఈ డీల్ ఓకే చేసి కంపెనీకి నష్టాలు తెప్పిద్దామనుకుంటున్నారా అంటాడు రాజు

జూన్ 13వ ఎపిసోడ్ లో డాక్యుమెంట్స్ ని చదివిన రాజు ఈ డీల్ ఓకే చేసి కంపెనీకి నష్టాలు తెప్పిద్దామనుకుంటున్నారా నా భార్యని సీఈవోగా పనికిరాదని దింపేద్దామనుకుంటున్నారా ఈ డీల్ కి నేను ఒప్పుకోను అంటూ అగ్రిమెంట్ పేపర్స్ చంపేస్తాడు. తర్వాత ఇందుని తను సేవ్ చేసినందుకు ఇందు తనకి హాగ్ ఇచ్చి ఐ లవ్ యు చెప్పినట్లు ఊహించుకుంటాడు. అదే సమయంలో ఇందు రాజు దగ్గరకు వచ్చి నువ్వు ఊహల్లో తప్ప రియాలిటీ లో ఉండవా ముందు వర్కర్స్ కి ఇవ్వాల్సిన శాలరీస్ గురించి ఆలోచించు అంటుంది. నువ్వు సీఈవో కాబట్టి నువ్వే ఆలోచించు అంటాడు రాజు. వర్కర్స్ శాలరీస్ క్లియర్ చేస్తాను కంపెనీని జెడ్ స్పీడ్ లో పరిగెట్టిస్తాను అని మాట ఇచ్చింది నువ్వు కాబట్టి నువ్వే ఆ ప్రాబ్లం గురించి ఆలోచించాలి అంటుంది ఇందు. మరోవైపు వెంకీ డెలివరీ బాయ్ గా జాయిన్ అవుతాడు కానీ తల్లిదండ్రులతో మాత్రం సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పటంతో వాళ్ళు ఆనందపడతారు. తల్లిదండ్రులకి నిజం తెలిస్తే ఏమైపోతారో అనుకుంటాడు వెంకీ.

మొత్తానికి ఈ వారం ‘బ్రహ్మముడి’ సీరియల్ ఇందు సీఈఓ కావడం, రేఖ నకిలీ అగ్రిమెంట్ ప్లాన్‌ను రాజు తిప్పికొట్టడంతో ఫుల్ మాస్‌గా సాగింది. అయితే సీఈఓ చైర్‌లో కూర్చున్న ఇందుకి కంపెనీ బాధ్యతలు, వర్కర్స్ శాలరీస్ రూపంలో కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. మరి ఈ శాలరీస్ ప్రాబ్లమ్‌ను రాజు ఎలా క్లియర్ చేస్తాడు? మరోవైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అని ఇంట్లో అబద్ధం చెప్పి డెలివరీ బాయ్‌గా మారిన వెంకీ నిజం తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుంది? అనే ఆసక్తికరమైన ట్విస్ట్‌లతో ఈ వారం కథ ముగిసింది. వచ్చే వారం మరిన్ని మలుపులతో సాగనున్న ఈ సీరియల్ అప్‌డేట్స్ కోసం వేచి చూడాల్సిందే!

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed