Captain Smit Machchhar: మోదీ ఫోన్ కాల్ మాకెంతో ప్రత్యేకం.. స్మిత్ సాహసం చూసి గర్వపడుతున్నాం: పైలట్ సతీమణి సోనాల్! | | ACTPnews

News18


Last Updated:

ఫ్లైదుబాయ్ విమానంలో 174 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రధాని స్వయంగా పరామర్శించడంపై స్మిత్ భార్య సోనాల్ హర్షం వ్యక్తం చేస్తూ దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

News18
News18

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ జరిపిన ప్రాణాంతక దాడిని తిప్పికొట్టి 174 మంది ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం అబుదాబిలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ ఆరోగ్యం గురించి మోదీ వాకబు చేశారు. తీవ్ర రక్తస్రావం జరుగుతున్న సమయంలో ప్రాణాలకు తెగించి కాక్‌పిట్ డోర్ లాక్ ఎలా తెరిచిందీ పైలట్ ప్రధానికి వివరించారు. ప్రధాని మోదీ స్వయంగా తమ కుటుంబంతో మాట్లాడటంపై స్మిత్ సతీమణి సోనాల్ మచ్చార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

ఒక సాధారణ పౌరుడి క్షేమం కోసం దేశ ప్రధాని స్వయంగా స్పందించడం మాటల్లో చెప్పలేని అనుభూతి అని ఆమె పేర్కొన్నారు. స్మిత్ ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను చూసి తమ కుటుంబం ఎంతో గర్విస్తోందని ఒక జాతీయ మీడియా ఛానల్ ముఖాముఖిలో సోనాల్ వెల్లడించారు.

ప్రధాని పరామర్శ మాకెంతో ధైర్యాన్నిచ్చింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమయం కేటాయించి స్మిత్‌‌తో మాట్లాడటం తమ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని సోనాల్ న్యూస్18 తో తెలిపారు. ఒక దేశ ప్రధాని స్వయంగా ఒక సాధారణ పౌరుడి పరిస్థితిని అడిగి తెలుసుకోవడం చాలా గొప్ప విషయమంటూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయులు స్మిత్ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారని ప్రధాని మోదీ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ప్రసంగంలో పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

సంఘటన జ్ఞాపకాలు గుర్తుచేయడం లేదు

స్మిత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని సోనాల్ చెప్పారు. ఆ విమానంలో ఏం జరిగిందనే విషయాలను తాము ప్రస్తుతానికి ఆయనను అడిగి తెలుసుకోవడం లేదని వివరించారు. ఆ చేదు జ్ఞాపకాలను మళ్లీ తలచుకోవడం వల్ల ఆయన మనస్సుపై ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే మానసికంగా పూర్తిగా కోలుకునే వరకు వేచి చూస్తున్నామని తెలిపారు. అబుదాబి వైద్యులు, సైనిక వైద్యుల పర్యవేక్షణలో అత్యుత్తమ వైద్యం అందుతోందని, త్వరలోనే ఆయన క్షేమంగా ఇల్లు చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు

స్మిత్ ప్రాణాలతో బయటపడాలని భారతదేశం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రార్థనలు పంపించారని, ఆ ప్రేమను చూసి తాను మాటలు రాని స్థితిలో ఉన్నానని సోనాల్ చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్మిత్‌ను నిజమైన హీరోగా అభివర్ణించారని గుర్తు చేశారు. ఆయనతో మాట్లాడే విషయంపై స్పందిస్తూ, స్మిత్ శారీరకంగా, మానసికంగా సంపూర్ణ స్వస్థత పొందిన తర్వాత నెతన్యాహుతో తప్పకుండా మాట్లాడతారని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports