Catherine Tresa: ‘శంబాల’ దర్శకుడి కొత్త సినిమా ‘కరికాల’.. కేథరిన్ థ్రెసా లుక్ చూశారా మావా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18

[ad_1]

Last Updated:

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ ‘కరికాల’ రూపంలో ఓ విజువల్ వండర్‌ క్రియేట్ చేయబోతున్నారు. వివరాల్లోకి పోతే..

News18
News18

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ ఓ విజువల్ వండర్‌ను క్రియేట్ చేయబోతోన్నారు. సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. ఈ మూవీని రెండు చాప్టర్‌లుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. సోషియో ఫాంటసీ, విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సందీప్ కిషన్‌కి జోడిగా కేథరిన్ థ్రెసా నటించనున్నారు. ఈ మేరకు హీరోయిన్‌కి వెల్కమ్ చెప్తూ చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. సందీప్ కిషన్, కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్ తెరపై మొదటి సారిగా కలిసి కనిపించబోతోన్నారు. ఇక ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్ ఓ డిఫరెంట్ రోల్‌ను పోషించబోతోన్నట్టుగా తెలుస్తోంది. వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ ‘కరికాల’ టీం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో ‘కరికాల’ పాన్ ఇండియన్ సినిమాగా రాబోతోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ‘కరికాల’ టీం పని చేస్తోంది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports