China Flood Havoc | చైనాలో జలప్రళయం.. వరదల్లో కొట్టుకుపోయిన కార్లు.. | ACTPnews

China Flood Havoc | చైనాలో జలప్రళయం.. వరదల్లో కొట్టుకుపోయిన కార్లు..



చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ, మధ్య చైనా వ్యాప్తంగా మంగళవారం (మే 19) కురిసిన కుండపోత వర్షాల కారణంగా జలప్రళయం సంభవించి కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారు. జియాన్ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో గుయిజౌ ప్రాంతంలో వరద ఉధృతికి ఒక కారు బొమ్మలా కొట్టుకుపోతున్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వరద ముంచెత్తడంతో స్థానికులు అంతా సముద్రంలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల ధాటికి పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడగా, రవాణా, విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. గ్వాంగ్డాంగ్, హునాన్, అన్హుయ్ సహా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని చైనా వాతావరణ శాఖ హెచ్చరించింది. హునాన్ ప్రావిన్స్ నుండి ఇప్పటికే 16,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అత్యవసర రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed