Dragon Movie: ‘డ్రాగన్’ మూవీ గ్లింప్స్‌కి టైమ్ ఫిక్స్.. దెయ్యాలు తిరిగే రాత్రి రిలీజ్ చేస్తున్నారేంటి మామ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ నెక్స్ట్ సినిమా పక్కా ఫ్లాప్ అనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ ‘దేవర’తో రూ.500 కోట్లు కొల్లగొట్టిండు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్ చేయాలనుకున్నాడు కానీ.. కథలో కొన్ని మార్పులు, చేర్పులు కోరడంతో కథ పక్కకు జరిగింది.

News18
News18

రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ నెక్స్ట్ సినిమా పక్కా ఫ్లాప్ అనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ ‘దేవర’తో రూ.500 కోట్లు కొల్లగొట్టిండు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్ చేయాలనుకున్నాడు కానీ.. కథలో కొన్ని మార్పులు, చేర్పులు కోరడంతో కథ పక్కకు జరిగింది. ఈ లోపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నిజానికి వీళ్ల కాంబినేషన్ ఎప్పుడో లాక్ అయిపోయింది. అయితే ‘దేవర-2’ తర్వాత వీళ్ల కాంబో పట్టాలెక్కాల్సి ఉంది.

అనుకోకుండా దేవర సీక్వెల్ ఆగిపోవడం.. అదే టైమ్‌లో ప్రశాంత్ నీల్ సైతం మళ్లీ ఎన్టీఆర్‌ను కలవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అసలు ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. మాములుగానే ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌లో ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి ఎప్పుడూ తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని చెప్పుకునే నీల్ మామ ఇప్పుడు ఇంకా ఏ రేంజ్‌లో ఎలివేషన్ సీన్లు రాసుకున్నాడో అని తారక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ గురించి ఆడియెన్స్ మాములుగా వేయిట్ చేయడం లేదు.

ఈ మూవీ గ్లింప్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ గ్లింప్స్‌కు సంబంధించిన టైమ్‌ను మెన్షన్ చేశాడు. ఈ గ్లింప్స్‌ను మంగళవారం అర్థరాత్రి 11:52 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే సరిగ్గా తారక్ పుట్టిన రోజుకు 8 నిమిషాల ముందు ఊచకోత సృష్టించబోతున్నాడన్నమాట. అంతేకాదు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే రాని లెంగ్త్‌లో డ్రాగన్ గ్లింప్స్ ఉండనుందట. ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ.. గ్లింప్స్ తర్వాత రెండింతలు అయిపోతాయని అంటున్నారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా 3 దేశాలను వణికించిన డ్రగ్ డీలర్ లార్డ్ ఖున్ సా కథ ఆధారంగా తెరకెక్కబోతుదందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో తారక్ తండ్రి, కొడుకులుగా కనిపించబోతున్నారని సమాచారం. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఫాదర్-సన్ ఎమోషన్ హైలైట్ కాబోతుందని తెలుస్తుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *