KKR vs MI: ఉత్కంఠ పోరు.. ముంబై పై కేకేఆర్ సూపర్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పక్కాగా వాడుకుంది. ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో KKR అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని KKR బ్యాటర్లు స్మార్ట్‌గా ఛేదించారు.

News18
News18

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పక్కాగా వాడుకుంది. ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో KKR అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని KKR బ్యాటర్లు స్మార్ట్‌గా ఛేదించారు.

అయితే, ముంబై విసిరిన చిన్న టార్గెట్‌ను ఛేదించే క్రమంలో KKR ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. ముంబై బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడటంతో కేవలం 54 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి నైట్ రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

ముఖ్యంగా భారీ ఇన్నింగ్స్ ఆడుతారనుకున్న సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే (21) క్రీజులో సెట్ అయినట్లే కనిపించి పెవిలియన్ చేరగా, అలెన్ (8), గ్రీన్ (4) ఘోరంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లు మ్యాచ్‌పై పట్టు బిగిస్తున్న తరుణంలో KKRని గట్టెక్కించే బాధ్యతను మిడిలార్డర్ భుజానెత్తుకుంది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన మన ‘లోకల్ బాయ్’ మనీశ్ పాండే, పవర్‌ఫుల్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముంబై బౌలింగ్ అటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మనీశ్ పాండే (45) క్లాస్ ఇన్నింగ్స్‌తో అలరించగా, పావెల్ (40) తన మార్క్ భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో, ఒకానొక దశలో కష్టాల్లో పడిన కోల్‌కతా.. ఆ తర్వాత సునాయాసంగా, గంభీరంగా టార్గెట్‌ను రీచ్ అయిపోయింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బలు తగిలాయి. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (15) కొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మరో ఓపెనర్ రికెల్టన్ (6) కూడా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడంతో పవర్‌ప్లే ముగిసేలోపే ముంబయి కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

మిడిలార్డర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (15) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. యువ ఆటగాడు తిలక్ వర్మ (20) కొద్దిసేపు ప్రతిఘటించినా ఇన్నింగ్స్‌ను నిలబెట్టలేకపోయాడు. నమన్ ధీర్ (0) డకౌట్‌గా వెనుదిరగగా, విల్ జాక్స్ (14) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (26) క్రీజులో ఉన్నంతసేపు ఆశలు కలిగించినా, కేకేఆర్ స్పిన్ దాడికి చిక్కి అవుట్ అయ్యాడు. 110 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ముంబయి పూర్తిగా కష్టాల్లో పడిన దశలో, టెయిల్ ఎండర్ ‘బాష్’ అద్భుతంగా బ్యాట్ ఝులిపించాడు. కేవలం 18 బంతుల్లో 32 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు ఊపిరి పోసి, సిక్సర్లతో స్కోరును ముందుకు నడిపాడు. చివరికి ముంబయి 147 పరుగుల గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి: KKR VS MI: తేలిపోయిన ముంబై బ్యాటర్లు.. కేకేఆర్ లక్ష్యం ఎంతంటే?

ఈ అద్భుత విజయంతో KKR పాయింట్ల పట్టికలో గట్టి జంప్ జిలానీ కొట్టింది. లీగ్ స్టేజ్‌లో అత్యంత కీలకమైన తరుణంలో సాధించిన ఈ గెలుపుతో KKR ఖాతాలో 13 పాయింట్లు చేరాయి. దాంతో, టేబుల్‌లో అప్పటివరకు పైన ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను కిందకు నెట్టేసి, నైట్ రైడర్స్ సగర్వంగా 6వ స్థానానికి దూసుకెళ్లింది. ప్లేఆఫ్స్ రేసును KKR మరింత ఆసక్తికరంగా మార్చేసింది!

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *