Chiranjeevi: మెగాస్టార్ @48 ఏళ్లు.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఒక సాధారణ నటుడిగా మొదలైన చిరంజీవి ప్రయాణం మెగాస్టార్‌గా ఎదిగే స్థాయికి చేరుకుంది. ఎన్నో పాత్రలు.. ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో విజయాలు.. ఇలా నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులతో కలిసి సాగుతున్న చిరంజీవి సినీ ప్రస్థానానికి ఇప్పుడు 48 ఏళ్లు పూర్తయ్యాయి.

News18
News18

ఒక సాధారణ నటుడిగా మొదలైన చిరంజీవి ప్రయాణం మెగాస్టార్‌గా ఎదిగే స్థాయికి చేరుకుంది. ఎన్నో పాత్రలు.. ఎన్నో ప్రయోగాలు.. మరెన్నో విజయాలు.. ఇలా నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులతో కలిసి సాగుతున్న చిరంజీవి సినీ ప్రస్థానానికి ఇప్పుడు 48 ఏళ్లు పూర్తయ్యాయి. చిరంజీవి వెండితెరపై అడుగుపెట్టిన తొలి సినిమా ‘పునాది రాళ్లు’. అయితే ఈ సినిమా కంటే ముందుగానే ఆయన నటించిన ‘ప్రాణం ఖరీదు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దీంతో చిరంజీవి సినీ ప్రస్థానంలో ‘ప్రాణం ఖరీదు’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన నటన, డ్యాన్స్, యాక్షన్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. క్రమంగా స్టార్ హీరోగా ఎదిగి.. ఆ తర్వాత మెగాస్టార్‌గా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తండ్రికి ప్రేమతో శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి సినీ ప్రయాణం తమ కుటుంబంపై చూపిన ప్రభావాన్ని గుర్తుచేసుకుంటూ చరణ్ రాసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘నాన్నా.. చిత్ర పరిశ్రమలో నీ ప్రయాణం మొదలై 48 ఏళ్లు పూర్తయింది. మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మేం ఎప్పటికీ మర్చిపోలేం. మా కోసం నువ్వు చేసిన కృషికి కృతజ్ఞతలు. నిన్ను ఆదరిస్తున్న ప్రేక్షకుల ప్రేమకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. నీ ప్రయాణం ఎప్పటికీ మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. నీ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ రామ్ చరణ్ తన తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు.

మరోవైపు చిరంజీవి కూడా తన 48 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులతో తన భావాలను పంచుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు చేసే అవకాశం దక్కిందని, అనేక విజయాలను అందుకున్నానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సినిమాలు నిర్మించిన నిర్మాతలకు, తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ప్రతి సినిమాను విజయవంతం చేయడానికి తెరవెనుక కష్టపడిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందిని కూడా చిరంజీవి ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. తన ప్రయాణంలో వారందరి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అయితే ఈ 48 ఏళ్ల ప్రయాణంలో తనకు అత్యంత విలువైనది ప్రేక్షకుల ప్రేమేనని చిరంజీవి స్పష్టం చేశారు. తనను కేవలం ఒక నటుడిగా కాకుండా తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తూ ఇన్నేళ్లుగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

చిరంజీవి సినీ ప్రయాణంలో 48 ఏళ్లు పూర్తవడం ఒక మైలురాయిగా నిలిచింది. ఇక 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తయ్యే సమయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన తండ్రి 50 ఏళ్ల సినీ వేడుకను చూడాలని రామ్ చరణ్ వ్యక్తం చేసిన ఆకాంక్ష ఇప్పుడు మెగా అభిమానుల్లోనూ ప్రత్యేకమైన ఆసక్తిని పెంచుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports