Last Updated:
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పట్ల సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.
Hyderabad Shocking News: అవకాశం దొరికితే చాలు ప్రతీ వాడు అమ్మాయిలపై ఏదో వెకిలి చేష్టలు చేయాలని.. లేదంటే కామవాంఛ తీర్చుకోవాలనే కక్తూర్తి పడుతూ ఉంటారు. కొద్దిరోజుల క్రితమే బీహార్‌లో ఓ అమ్మాయిని ముగ్గురు యువకులు నడిరోడ్డుపై వేధింపులకు గురి చేశారు. ఈ వార్త, వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈఘటన మర్చిపోక ముందే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పట్ల సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందిరానగర్ ప్రాంతంలో ఉద్యోగిని ఆఫీస్ క్యాబ్ ఎక్కుతున్న సమయంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న రాజ్ కుమార్ ఆమెకు ముద్దుపెట్టాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడ్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.
అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. చదువుకునే అమ్మాయిలకు స్కూల్స్, కాలేజీల్లో వేధింపులు తప్పడం లేదు. ఉద్యోగం చేసే యువతులకు ఆఫీసులు, పబ్లిక్ ప్లేసుల్లో పోరికి గాళ్లు టార్చర్ పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి పట్ల ఒక వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, రాజ్‌కుమార్ అనే సెక్యూరిటీ గార్డ్ ఆమె వద్దకు వచ్చాడు. ఒక్కసారిగా ఆమెను పక్కకు లాగి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ ఆకస్మిక పరిణామంతో దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
సెక్యూరిటీ గార్డుగా ఉన్న కామాంధుడు చేష్టలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఝార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించి అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.














