The Paradise Movie: థియేటర్‌లో ఇక సర్వపిండి కూడా.. ‘ది ప్యారడైజ్’తో కొత్త ట్రెండ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలంగాణ సంస్కృతి, పల్లె జీవితం, అక్కడి మట్టి వాసన, స్థానిక భాష, యాస.. ఇవన్నీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు తెలంగాణ యాసను ఎక్కువగా విలన్ పాత్రలు, కామెడీ సన్నివేశాలకే పరిమితం చేసేవారు.

News18
News18

తెలంగాణ సంస్కృతి, పల్లె జీవితం, అక్కడి మట్టి వాసన, స్థానిక భాష, యాస.. ఇవన్నీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు తెలంగాణ యాసను ఎక్కువగా విలన్ పాత్రలు, కామెడీ సన్నివేశాలకే పరిమితం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ యాసే కథలో భాగంగా మారడంతో పాటు, అక్కడి జీవనశైలి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు కూడా సినిమాల్లో కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మరో ఆసక్తికరమైన అంశం ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సినిమాతో తెరపైకి వచ్చింది.

శ్రీకాంత్ ఓదెల, వేణు యెల్దండి వంటి దర్శకులు తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని తమ కథల్లో సహజంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ ఓదెల తన తొలి చిత్రం ‘దసరా’తో తెలంగాణ పల్లె వాతావరణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. నాని హీరోగా తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, నానికి తొలి రూ.100 కోట్ల గ్రాస్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఇదే దర్శకుడు మరింత విభిన్నమైన కథ, భారీ స్థాయి మేకింగ్‌తో ‘ది ప్యారడైజ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

నాని హీరోగా నటించిన ఈ సినిమాలో మంచు మోహన్‌బాబు కీలకమైన ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. రాఘవ్ జుయల్, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేశ్ బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు కీర్తి సురేష్ ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే సెప్టెంబర్ 23 సాయంత్రం నుంచే కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రదర్శించే థియేటర్లలో తెలంగాణ సంస్కృతికి సంబంధించిన మరో ప్రత్యేక అంశాన్ని పరిచయం చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

‘ది ప్యారడైజ్’ ప్రదర్శించే సమయంలో ప్రేక్షకులకు ఇంటర్వెల్‌లో సర్వపిండి అందుబాటులోకి రానుంది. తెలంగాణ సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సర్వపిండిని థియేటర్ స్నాక్స్ జాబితాలో చేర్చాలని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించింది. ప్రస్తుతం బాలానగర్‌లోని విమల్ థియేటర్, గడ్డిఅన్నారంలోని శివగంగ థియేటర్లలో సర్వపిండిని ఇంటర్వెల్ స్నాక్‌గా అందించనున్నట్టు ప్రకటించారు.

సాధారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ఇంటర్వెల్ సమయంలో పాప్‌కార్న్, సమోసా, పఫ్, సాండ్‌విచ్ వంటి స్నాక్స్ అందుబాటులో ఉంటాయి. అయితే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో సర్వపిండిని కూడా చాలా కాలంగా స్నాక్‌గా తీసుకునే సంప్రదాయం ఉంది. బియ్యప్పిండి, పప్పులు, మిరపకాయలు, ఉల్లిపాయలు వంటి పదార్థాలతో తయారయ్యే ఈ వంటకం తెలంగాణ వంటకాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఇప్పుడు అదే సర్వపిండి నగరంలోని సినిమా థియేటర్ స్నాక్స్ మెనూలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ‘ది ప్యారడైజ్’ సినిమాతో తెలంగాణ భాష, పల్లె సంస్కృతి మాత్రమే కాకుండా.. తెలంగాణ రుచిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కాన్సెప్ట్‌కు మంచి ఆదరణ లభిస్తే.. భవిష్యత్తులో హైదరాబాద్‌లోని మరిన్ని థియేటర్లలో కూడా సర్వపిండి వంటి స్థానిక వంటకాలు స్నాక్స్ మెనూలో చేరే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports