CM Chandrababu : తిరుమలలో దేవాన్ష్ బర్త్‌డే వేడుకలు.. | ACTPnews

CM Chandrababu  : తిరుమలలో దేవాన్ష్ బర్త్‌డే వేడుకలు..



ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో, అర్చకులు వారికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళిన చంద్రబాబు కుటుంబం, అక్కడ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. దేవాన్ష్ పేరిట అన్నదాన ట్రస్టుకు విరాళం కూడా అందజేసినట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *